‘ఆపరేషన్ సింధూర్’ పేరిట పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌తో పాక్ వెన్నులో వణుకు పట్టుకుంది. అయితే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని భారత 28వ ఆర్మీ చీఫ్ మనోజ్ సరవణె ట్వీట్ చేశారు. ‘అబీ పిక్చర్ బాకీ హై’ అని ఆయన ట్వీట్ చేయడం.. అలాగే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. త్వరలోనే మరిన్ని మెరుపు దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుండటంతో.. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించే దాకా ఇవి జరగడం ఖాయమని స్పష్టమవుతోంది.
భారత ఆర్మీ చీఫ్ ప్రకటన – ఇది ట్రైలర్ మాత్రమే!
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. బిహార్‌లో ప్రధానమంత్రి వార్నింగ్ ఇచ్చినట్టుగానే వారి స్థావరాల్లో వారికి సమాధి కట్టేశారు. ఉగ్రస్థావరాల లెక్కలు తీసి మరీ టార్గెట్ చేసి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. చెప్పి మరీ ఎటాక్ చేసిన భారత సైన్యం. దాడులకు కొద్ది నిమిషాల ముందే ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది. అర్ధరాత్రి ఒంటిగంట 28 నిమిషాలకు దాడికి సిద్ధం.. గెలుపే లక్ష్యం అంటూ ఆర్మీ ట్వీట్ చేసింది. ఒంటి గంట 51 నిమిసాలకు ఆపరేషన్ ముగిసాక న్యాయం జరిగింది.. జై హింద్ అంటూ ఆర్మీ మరో ట్వీట్ చేసింది. ఆపరేషన్ సింధూర్‌ని స్వయంగా పర్యవేక్షించారు భారత ప్రధాని మోదీ. వార్‌రూమ్ నుంచి లైవ్‌లో వీక్షించారు. కాసేపట్లో CCS కీలక భేటీ జరగనుంది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత నుంచి 3 సార్లు CCS మీటింగ్ జరిగింది.సీసీఎస్ భేటీ అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది.