📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Pakistan : మా సైనిక స్థావరాలపై భారత్‌ దాడి నిజమే : పాక్‌ ఉప ప్రధాని

Author Icon By Sudha
Updated: June 20, 2025 • 2:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్‌ ఉప ప్రధాని మరియు విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ (Ishaq Dar)ఇటీవల ఒక ప్రకటనా ద్వారా, భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)పేరిట పాక్‌ సైనిక స్థావరాలను లక్ష్యంగా దాడులు చేసినట్లు వెల్లడించారు. ఈ దాడులు నిజమైనవని ఆయన తెలిపారు.

Pakistan : మా సైనిక స్థావరాలపై భారత్‌ దాడి నిజమే : పాక్‌ ఉప ప్రధాని


అంగీకరించిన పాక్
ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ (Pakistan)కు భారత్‌ గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor)తో పాక్‌ (Pakistan)పై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ఆ దేశంలోని ఉగ్ర స్థావరాలు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే, ఇన్నాళ్లూ తమకు జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చుకుంటూ వస్తోన్న పాక్‌.. తాజాగా దాన్ని అంగీకరించింది.
ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా తమ కీలక సైనిక స్థావరాలపై భారత్‌ దాడులు నిజమే అని పాక్‌ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ తాజాగా వెల్లడించారు. రెండు కీలక ఎయిర్‌బేస్‌లపై భారత్‌ దాడి చేసినట్లు ఒప్పుకున్నారు. రావల్పిండిలోని నూర్‌ ఖాన్‌ వైమానిక స్థావరం, షోర్‌కోట్‌ వైమానిక స్థావరాలను భారత్‌ లక్ష్యంగా చేసుకుందని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడుల అనంతరం తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు సౌదీ అరేబియా రంగంలోకి దిగిందని కూడా దార్ ఈ సందర్భంగా వెల్లడించారు.
భారత్‌ చాలా వేగంగా స్పందించింది
జియో న్యూస్‌తో ఇషాక్‌ దార్‌ మాట్లాడుతూ.. ‘మేము తిరిగి దాడి చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే ఈ దాడులు జరిగాయి. భారత్‌ చాలా వేగంగా స్పందించింది’ అని తెలిపారు. భారత్‌ దాడులు జరిగిన 45 నిమిషాల్లోనే సౌదీ యువరాజు ఫైసల్‌ బిన్‌ సల్మాన్‌ తనను వ్యక్తిగతంగా సంప్రదించారని దార్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. సౌదీ యువరాజు తనను ఫోన్‌లో సంప్రదించినట్లు చెప్పారు. ‘పాకిస్థాన్‌ దాడులు ఆపేందుకు సిద్ధంగా ఉందని భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌కు తెలియజేయవచ్చా’ అని తనని అడిగినట్లు దార్‌ వివరించారు.

Read Also:Netanyahu: రెండోసారి నెతన్యాహు కుమారుడి పెళ్లి వాయిదా.. రాజకీయ

#IndiaPakistan #IshaqDarr #OperationSindoor #SurgicalStrikes #telugu News BorderTensions Breaking News in Telugu Google news Google News in Telugu India's attack on Latest News in Telugu our military bases is real: Pakistan Deputy Prime Minister Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.