📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Telugu News: Indians: ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం

Author Icon By Pooja
Updated: September 23, 2025 • 1:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవిని స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ విదేశీయుల(Foreigners) పట్ల కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీసాలపై తనదైన ఉక్కుపాదాన్ని మోపుతూ, సాధ్యమైనంతగా అమెరికా నుంచి విదేశీయులను వెనక్కి పంపే యత్నంలో ఉన్నారు. ఇందులో భాగంగా హెచ్ 1బి వీసాకు లక్షడార్లర్ల ఫీజును పెంచారు.

అంతేకాక విదేశీయులపై నిత్యం ఏదోఒక విషయంలో విమర్శిస్తూ, విద్యార్థుల, ఉద్యోగుల రాకను అడ్డుకుంటున్నారు. దీంతో అమెరికాలో ఉపాధి, చదువుకు అనే తమ కలల నుంచి బయటకు వస్తున్నారు అనేకులు. ఇప్పటికే చాలామంది పెట్టేబేడా సర్దుకుని స్వదేశీ తిరుగుప్రయాణం పట్టారు. దీంతో పలు దేశాలు భారతీయ నిపుణులకు గ్రీన్ కార్పెటును పరుస్తున్నాయి. ఆ దేశాలు ఏమిటో తెలుసుకుందాం.

కెనడా, జర్మనీలలో బోల్డెన్నీ అవకాశాలు

ప్రస్తుతం భారతీయ నిపుణులకు అత్యంత ఆకర్షణీయమైన దేశంలో కెనడా నిలుస్తోంది. అక్కడి ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్ ద్వారా విదేశీ నిపుణులు సులభంగా వర్క్ వీసా పొందవచ్చు. ముఖ్యంగా ఐటీ రంగంలో విస్తృత అవకాశాలు ఉండటం, శాశ్వత నివాసం (పీఆర్) ప్రక్రియ కూడా సులభతరం కావడంతో చాలామంది కెనడాను ఎంచుకుంటున్నారు. యూరప్ లో ఆర్థికశక్తిగా పేరొందిన జర్మనీ కూడా నిపుణులకు మంచి గమ్యస్థానంగా ఉంది. ముఖ్యంగా తయారీ, ఇంజినీరింగ్ రంగాల్లో ఇక్కడ ఉద్యోగాలు పుష్కలంగా ఉన్నాయి. జాబ్ సీకర్ వీసాతో ఆరు నెలలపాటు అక్కడే ఉండి ఉద్యోగం వెతుక్కునే సౌలభ్యం ఉంది. ఉద్యోగం లభించగానే దాన్ని వర్క్ పర్మిట్గా గా మార్చుకోవచ్చు. యూరోపియన్ యూనియన్ బ్లూకార్డ్ ప్రోగ్రామ్(European Union Blue Card Program) కూడా జర్మనీలో పనిచేయడానికి మార్గం సుగమం చేస్తోంది.

ఈ దేశాల్లో కూడా ఆకర్షణీయమైన ప్యాకేజీలు

ఆసియాలోనే మంచి అవకాశాలు కోరుకునే వారికి సింగపూర్ సరైన ఎంపిక. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), బ్యాంకింగ్, మార్కెటింగ్ రంగాల్లో నైపుణ్యం ఉన్నవారికి ఎంప్లాయిమెంట్ పాస్ (ఈపీ), ద్వారా వీసా ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. ఇక్కడ జీతాలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉండటం మరో ప్రత్యేకత. అదేవిధంగా ఆస్ట్రేలియా కూడా మెరుగైన జీవన ప్రమాణాలు, అనుకూలమైన పని వాతావరణంతో నిపుణులను ఆకర్షిస్తోంది. జనరల్ స్కిల్డ్ మైగ్రేషన్ (జీఎస్ఎం) ప్రోగ్రామ్ ద్వారా నైపుణ్యం కలిగిన వారికి మార్గం సులభం. ఐటీ, ఇంజినీరింగ్, హెల్త్కేర్, విద్య వంటి రంగాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది.

అమెరికా కొత్త నిబంధనల నేపథ్యంలో భారత నిపుణులు తమ కెరీర్ ప్రణాళికను మార్చుకుంటూ, స్వాగతం పలుకుతున్న ఇతర దేశాల్లో తమ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. నైపుణ్యత ఉండేలా కానీ, ఏ దేశంలోనైనా అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా ఎదగొచ్చని నిపుణులు అంటున్నారు.

భారతీయులకు ఎక్కడ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి?

అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్, మధ్యప్రాచ్యం మరియు ఆసియా-పసిఫిక్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి.

ఏ రంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి?

ఐటీ, హెల్త్‌కేర్, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో డిమాండ్ ఎక్కువ.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News in Telugu Global Careers Google News in Telugu Healthcare Jobs Indians Abroad it jobs job opportunities Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.