ప్రస్తుతం భారత్ యువత విదేశాల్లో వైద్య విద్యను (Study Medicine) అభ్యసించేందుకు పెద్ద ఎత్తున ముందుకు వస్తోంది. ముఖ్యంగా అమెరికా ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో చదవాలన్న ఆకాంక్ష పెరుగుతోంది. అక్కడి టాప్ యూనివర్సిటీలలో సీటు పొందేందుకు విద్యార్థులు కృషి చేస్తున్నారు.టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన జాబితా ప్రకారం, అమెరికా (America) లోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం వైద్యరంగంలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ఈ విశ్వవిద్యాలయం పరిశోధన, బోధన, ఉద్యోగ అవకాశాలలో అగ్రగామిగా నిలిచింది. వైద్య డిగ్రీ ఎండీ, భారత్‌లోని ఎంబీబీఎస్‌కు సమానం.
ఇతర ప్రముఖ విశ్వవిద్యాలయాలు
హార్వర్డ్ తర్వాత జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం రెండో స్థానంలో ఉంది. ఇది అద్భుతమైన బోధన, పరిశోధనలకు ప్రసిద్ధి చెందింది. అలాగే స్టాన్‌ఫోర్డ్, యేల్, పెన్సిల్వేనియా, కాలిఫోర్నియా బర్కిలీ, యూసీఎల్‌ఏ, కొలంబియా, వాషింగ్టన్, డ్యూక్ విశ్వవిద్యాలయాలు కూడా టాప్ 10లో ఉన్నాయి.
అమెరికాలో టాప్ 10 వైద్య విశ్వవిద్యాలయాలు
హార్వర్డ్ విశ్వవిద్యాలయం.
జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం.
స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం.
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, లాస్ ఏంజిల్స్.
కొలంబియా విశ్వవిద్యాలయం.
వాషింగ్టన్ విశ్వవిద్యాలయం.
డ్యూక్ విశ్వవిద్యాలయం.
ఎందుకు ఇంత క్రేజ్?
ఈ విశ్వవిద్యాలయాలు అత్యుత్తమ బోధన ప్రమాణాలు, పరిశోధన సౌకర్యాలు కలిగి ఉంటాయి. విద్యార్థులు ఇక్కడ శాస్త్రీయ ఆవిష్కరణలకు దోహదం చేసే అవకాశాలు పొందుతారు. ఈ సంస్థల నుండి చదువు పూర్తి చేసిన వైద్య నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత వేతనాలు, మంచి ఉద్యోగాలు పొందుతున్నారు.ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో మంచి కెరీర్ కోసం భారత్ విద్యార్థులు యూఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. టాప్ విశ్వవిద్యాలయాల ప్రాధాన్యం, పరిశోధన వాతావరణం, భవిష్యత్ అవకాశాలు ఈ ఆకర్షణకు ప్రధాన కారణాలు అవుతున్నాయి.
Read Also : Liechtenstein : ఈ దేశానికి ఎయిర్ పోర్ట్ లేదు కానీ..