US: వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ

Read Time:  1 min
వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ
వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ
FONT SIZE
GET APP

అమెరికా రాజకీయాల్లో భారతీయులు చక్రం తిప్పుతున్నారు. అగ్రరాజ్యంలో పలువురు భారత సంతతి వ్యక్తులు కీలక పదవుల్లో ఉన్నారు. ఇటీవల న్యూయార్క్ మేయర్‌(Mayor of New York) గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మామ్దానీ ఎన్నికైన సంగతి తెలిసిందే. తాజాగా, మరో భారత సంతతికి చెందిన మహిళ.. తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మేయర్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తమిళ మూలాలున్న రిని సంపత్ (31) బుధవారం ప్రకటించారు. డెమొక్రాట్ల ప్రైమరీలో అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రిని.. రాజధాని నగరంలో మౌలిక వసతులను పెంచడం, పాలనపై ప్రజలకు విశ్వాసం కలిగించడమే తన ప్రధాన ధ్యేయమని ఆమె స్పష్టం చేశారు.

Read Also: Madhya Pradesh: పరిహారం అడిగినందుకు ఇద్దరు మహిళల్ని సజీవంగా పూడ్చిన గూండాలు

US: Indian woman in Washington DC mayoral race
US: Indian woman in Washington DC mayoral race

ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా..

ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న ఆమె.. ప్రస్తుత నగర నాయకత్వంపై విమర్శలతో తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ‘‘నగర పాలనలో మేయర్‌గా కనీస హామీలను నెరవేర్చడమే నా ప్రాధాన్యత. రహదారులపై గుంతలు పూడ్చడం, మురుగునీటి సమస్యను పరిష్కరించడం, నిత్యావసరాల ధరలు తగ్గించడం, అత్యవసర సహాయం 911 కాల్స్ వెయిటింగ్ సమయం తగ్గించడం వంటివి చేస్తాను’’ అని రిని సంపత్ వాగ్దానం చేశారు. విధి నిర్వహణలో ప్రాథమిక విధులు నిర్వర్తించడంలో విఫలమైన ఉద్యోగులకు పదోన్నతలు ఎందుకు ఇవ్వాలని ఆమె నిలదీశారు. నగర కౌన్సిల్‌లో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న రాజకీయ నేతలపై పరోక్షంగా ఆమె విమర్శలు గుప్పించారు. ఇటీవల సంభవించిన మంచు తుపానుతో రహదారులు, ఫుట్‌పాత్‌లు ప్రమాదకరంగా మారాయని, వీధుల్లో చెత్త పేరుకుపోయిందని, పైపులైన్లు పగిలిపోయాయని ఆమె అన్నారు. ఈ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జనం.. పనులకు వెళ్లలేక ఆదాయం కోల్పోయారని అన్నారు. వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయని తన ప్రచార వీడియోలో భారత సంతతి మహిళ పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.