📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu news : Indian tourist – సాయం చేయండి.. నేపాల్‌లో భారత పర్యాటకురాలు..!

Author Icon By Sudha
Updated: September 10, 2025 • 3:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేపాల్‌ లో జెన్‌-జడ్‌ నిరసనలు (Gen Z protests) హింసకు దారితీశాయి. నిరసనకారులు దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నిప్పటించారు. ప్రధాని, మాజీ ప్రధానులు, మంత్రుల ఇళ్లకు కూడా నిప్పుపెట్టారు. ఆ ఇళ్లలో దొరికిన వారిపై దాడులకు పాల్పడ్డారు. దాంతో ఆ దేశంలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. పొఖారా ప్రాంతంలోని ఓ హోటల్‌పై కూడా నిరసనకారులు దాడి చేశారు. దాంతో ఆ హోటల్‌లో బస చేస్తున్న భారత పర్యాటకురాలు (Indian Tourist) ఉపాసన గిల్ సాయం కోసం అర్థించారు. భారత ప్రభుత్వం తనకు సాయం చేయాలని ఓ వీడియోలో మొరపెట్టుకున్నారు.

Indian tourist – సాయం చేయండి.. నేపాల్‌లో భారత పర్యాటకురాలు..!

‘నా పేరు ఉపాసన గిల్. వాలీబాల్‌ లీగ్‌ కోసం నేపాల్‌కు వచ్చాను. నిరసనలతో పొఖారా ప్రాంతంలో ఉన్న హోటల్‌లో చిక్కుకుపోయాను. తొలుత నేను బస చేసిన హోటల్‌కు నిప్పంటించారు. నా వస్తువులన్నీ అందులోనే ఉండిపోయాయి. దాడి సమయంలో నేను స్పాలో ఉన్నాను. కొందరు నిరసనకారులు పెద్దపెద్ద కర్రలతో నా వెంటపడ్డారు. ప్రస్తుతం పరిస్థితులు ఏమాత్రం బాగా లేవు. రోడ్డుపై ఎక్కడ చూసినా మంటలే కనిపిస్తున్నాయి. వారు పర్యాటకులను (Indian Tourist)కూడా వదలడం లేదు. ఎలాంటి ఆలోచన లేకుండా ప్రతిదీ తగలబెడుతున్నారు. పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడం లేదు. నాతోపాటు చాలామంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు’ అని గిల్‌ ఆ వీడియోలో ఆవేదనచెందారు. ఇదిలావుంటే.. ఇప్పటికే నేపాల్‌లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అక్కడి రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్లను వెల్లడించింది. అలాగే పరిస్థితులు చక్కబడేవరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం ఉన్నచోటే ఉండాలని, వీధుల్లోకి రావొద్దని హెచ్చరించింది. ఎప్పటికప్పుడు స్థానిక యంత్రాంగం ఇచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. కాగా నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని సొనౌలీ ప్రాంతం మీదుగా భారతీయ పర్యాటకులు (Indian Tourist)తిరిగి స్వదేశానికి వస్తున్నారు.

నేపాల్ సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య?

మొత్తం పర్యాటకులలో, 2024లో హిమాలయ దేశంలో అత్యధిక సంఖ్యలో పర్యాటకులు భారతీయులు, వీరి సంఖ్య 3.17 లక్షలు , ఆ తర్వాత అమెరికా నుండి 1.11 లక్షల మంది, చైనా నుండి 1.01 లక్షల మంది మరియు యునైటెడ్ కింగ్‌డమ్ నుండి 57,554 మంది పర్యాటకులు వచ్చారు.

భారతీయులు నేపాల్లో ఎన్ని రోజులు ఉండవచ్చు?

నేపాల్ టూరిస్ట్ వీసా వ్యవధి ప్రవేశించిన తేదీ నుండి 15 రోజులు, 30 రోజులు లేదా 90 రోజుల వరకు ఉంటుంది. మీరు నేపాల్‌లో ఉండగల కాలం మీరు దరఖాస్తు చేసుకునే టూరిస్ట్ వీసా రకాన్ని బట్టి ఉంటుంది.

నేపాల్ పర్యాటక రంగం ర్యాంక్?

2022 సంవత్సరంలో నేపాల్ పర్యాటక ర్యాంకింగ్ 81వ స్థానంలో ఉంది మరియు 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల సంఖ్య పరంగా 147వ స్థానంలో ఉంది. ప్రస్తుతం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రచురించిన తాజా ట్రావెల్ & టూరిజం డెవలప్‌మెంట్ ఇండెక్స్ 2024లో నేపాల్ 105వ స్థానంలో ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/nepal-conflict-centers-key-instructions-for-indians-in-nepal/national/544603/

Breaking News indian tourist Indian woman in Nepal International Travel latest news Nepal news Telugu News tourist help

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.