📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Australia: భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

Author Icon By Vanipushpa
Updated: January 31, 2026 • 5:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించి.. కుటుంబానికి మంచి పేరు తేవాలని కలలు కన్న ఓ భారతీయ యువకుడు ఆస్ట్రేలియాకు వెళ్లాడు. కానీ కన్న కలల కంటే డబ్బుపై ఆశ ఎక్కువ అయింది. ఈక్రమంలోనే ఓ మోసానికి తెరలేపాడు. ఐటీ విద్యార్థిగా ఉంటూనే.. టెక్నాలజీని ఉపయోగించిన ఓ న్యాయవాది అవతారం ఎత్తాడు. అమాయక ఆస్తి కొనుగోలు దారు నుంచి ఏకంగా 2.09 లక్షల ఆస్ట్రేలియన్ (Australia) డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.1.33 కోట్లు) కాజేశాడు. ఈ అసాధారణ లాయర్ స్కామ్ వెలుగులోకి రావడంతో.. సదరు విద్యార్థికి రెండేళ్ల జైలుశిక్ష పడింది.

Read Also: Putin ukraine ceasefire : పుతిన్ గ్రీన్ సిగ్నల్? ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ షాక్!

Australia: భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

నకిలీ కంపెనీని ఏర్పాటు

ఆస్ట్రేలియాలో స్టూడెంట్ వీసాపై ఉంటున్న ప్రదీప్.. పార్ట్ టైమ్‌గా ఉబెర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇది మాత్రమే కాకుండా 2024 అక్టోబర్‌లో సిడ్నీలోని ఒక ప్రముఖ లా ఫర్మ్ ద్వారా ఇల్లు కొనుగోలు చేస్తున్న ఒక క్లయింట్ సమాచారాన్ని ప్రదీప్ తస్కరించాడు. వెంటనే ఆ లా ఫర్మ్ వెబ్‌సైట్‌ను పోలిన డొమైన్ పేరును రిజిస్టర్ చేశాడు. అసలు న్యాయవాది ఈమెయిల్ అడ్రస్, డిజిటల్ సంతకాన్ని అచ్చుగుద్దినట్లుగా సృష్టించి బాధితుడిని నమ్మించాడు. తద్వారా ఒక నకిలీ కంపెనీని ఏర్పాటు చేసి వెస్ట్‌పాక్ బ్యాంక్‌లో బిజినెస్ ఖాతాను కూడా తెరిచాడు. కొన్ని వారాల పాటు బాధితుడితో నిరంతరం ఈమెయిల్స్ ద్వారా టచ్‌లో ఉన్న ప్రదీప్.. ఇల్లు రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ పేరుతో నవంబర్ 13వ తేదీన తన ఖాతాకు 2.09 లక్షల డాలర్లు బదిలీ చేయించుకున్నాడు. వారం తర్వాత బాధితుడు అసలు లా ఫర్మ్‌ను సంప్రదించడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. అప్పటికే ప్రదీప్ ఆ డబ్బుతో బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి.. వాటితో సెల్ఫీలు దిగడం గమనార్హం. మరోవైపు మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ ఆధారంగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Court Verdict Indian Nationals Abroad Indian student jailed international law legal trouble abroad overseas education news student crime case Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.