📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Trump: ఇంటిబయటే హత్యకు గురైన భారత సంతతి వ్యాపారవేత్త

Author Icon By Sushmitha
Updated: October 28, 2025 • 12:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతీయులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రత్యేకంగా జాతివివక్షతతో విదేశాల్లో భారతీయులు పలు ఇబ్బందులను, అవమానాలను ఎదురొ్కంటున్నారు. ఎన్నో ఆశలతో అక్కడివెళ్లి, స్థిరపడాలనుకునేవారు అనుకోని ఉపద్రవంలో చిక్కుకుని, హతమార్చబడుతున్నారు. జాత్యాంకారంతో దూషించేవారు కొందరైతే, చంపేవారు మరికొందరు. తద్వారా భారతీయులకు ఏమాత్రం భద్రత ఉండడం లేదు. తాజాగా కెనడాలో(Canada) భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ సింగ్(Darshan Singh) సాప్సీ (68) దుండగుడి కాల్పుల్లో మరణించారు.

Read Also: Nadendla Manohar:తుఫాను ప్రభావిత జిల్లాల్లో రేషన్ పంపిణీ ప్రారంభం

‘కానమ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు దర్శన్ సింగ్ హత్య తీవ్రకలకలం రేపింది.

అబాట్స్ ఫోర్ట్(Abbot’s Fort) పోలీస్ డిపార్ట్మెంట్ వివరాల ప్రకారం, సోమవారం ఉదయం రిడ్జ్ వ్వూ డ్రైవ్ లో కాల్పులు జరిగినట్లు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి, కారులో ఉన్న సాప్సీ తీగ్రాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సిబ్బంది వెంటనే వైద్య ప్రథమ చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఆయన అక్కడిక్కడే మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.

ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయని పోలీసులు

ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ ఇంకా ప్రాథమిక దశలో ఉందని సార్జెంట్ పాల్ వాకర్ తెలిపారు. కేసును అబాట్స్ ఫోర్డ్ మేజర్ క్రైమ్ యూనిట్ నుంచి ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్కు బదిలీ చేశామని, తదుపరి వివరాలను వారే వెల్లడిస్తారని తెలిపారు.

వ్యాపారవేత్తగా అంచెలంచెలుగా ఎదిగిన దర్శన్ సింగ్

దర్శన్ సింగ్ సాప్సీ పంజాబ్ లోని లుధియానా జిల్లా, రాజ్ గఢ్ గ్రామానికి చెందినవారు. ఒకరైతు కుటుంబానికి చెందిన ఆయన 1991లో కెనడాకు వలస వెళ్లి, వ్యాపారవేత్తగా అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన స్థాపించిన కానమ్ గ్రూప్, ప్రపంచంలోని అతిపెద్ద క్లాతింగ్ రీసైక్లింగ్ కంపెనీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. 40కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆయన గుజరాత్ లోని కాండ్లాలో కూడా వ్యాపారం నిర్వహిస్తున్నారు.

ఈ హత్య ఎక్కడ జరిగింది?

భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త ఇంటి బయట ఈ హత్య జరిగింది.

హత్యకు గురైన వ్యక్తి ఎవరు?

భారత సంతతికి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఈ హత్యకు గురయ్యారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Expatriate crime Fatal shooting Geopolitical significance Google News in Telugu Indian businessman murder Investigation underway Latest News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.