Indian Origin: అమెరికా రాజకీయాల్లో మరోసారి భారత సంతతి ప్రతిభ దూసుకుపోయింది. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో డెమోక్రాట్లు భారీ విజయాన్ని సాధించగా, ఈ విజయాల్లో భారత మూలాలున్న ముగ్గురు అభ్యర్థులు ప్రధాన పాత్ర పోషించారు. న్యూ యార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, వర్జీనియా రాష్ట్రాల్లో జరిగిన గవర్నర్, మేయర్ మరియు స్థానిక ఎన్నికల్లో డెమోక్రాట్లు ఆధిపత్యం చాటారు. డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఈ ఫలితాలు పెద్ద దెబ్బగా మారాయి.
Read also: London: ఆసియా-2026 ర్యాంకింగ్స్‌లో భారత్ కు చోటు
Indian Origin: గవర్నర్ మేయర్ ఎన్నికల్లో ట్రంప్ కు బిగ్ షాక్
Indian Origin: ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది భారతీయ మూలాల అభ్యర్థుల గెలుపు. న్యూయార్క్‌లో 34 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ (Zohra Mamdani) మేయర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ట్రంప్ ప్రయత్నాలను ధిక్కరించి, మమ్దానీ విజయం సాధించడం అమెరికా రాజకీయాల్లో ఒక కొత్త మలుపుగా నిలిచింది. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టిన ఆయన ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి, యువతలో నూతన ఆశలను రేకెత్తించారు. మరోవైపు వర్జీనియాలో గజాలా హష్మీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా గెలిచి చరిత్ర సృష్టించారు. హైదరాబాద్‌లో జన్మించిన ఆమె అమెరికాలో పెరిగి రాజకీయ రంగంలో సత్తా చాటారు. అదేవిధంగా వర్జీనియా హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లో జెజె సింగ్ కూడా గెలిచి భారత సంతతికి మరో గౌరవాన్ని తీసుకువచ్చారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: