📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran War: భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

Author Icon By Vanipushpa
Updated: March 14, 2026 • 3:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమాసియా(West Asia)లో మొదలైన యుధ్దం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల నుంచి చమురు షిప్పులు ఆగిపోతున్నాయి. ఫలితంగా బ్యారల్ చమురు ధర ఏకంగా 100 డాలర్లకు పెరిగింది. యుద్ధం ముందు వరకు ఇది 70 డాలర్లు ఉండగా..యుద్ధం మొదలవగానే 100 డాలర్లకు పెరిగింది. దీంతో చమరును గల్ఫ్ దేశాల నుంచి కాకుండా రష్యా నుంచి ఆసియా దేశాలు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురయింది. దీంతో రష్యా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అయితే ముడి చమురు ధరలు పెరిగినా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో చమురు కంపెనీలు భారీగా నష్టాలు మూటగట్టుకుంటున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్, మార్కెటింగ్ నష్టాల ప్రభావం రోజూ రూ.2 వేల కోట్ల వరకు చేరిందని సిస్టమాటిక్స్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వెల్లడించింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) BPCL, HPCL, IOC petrol, డీజిల్‌లపై వరుసగా లీటరుకు రూ. 20, రూ.45 నష్టాలను చవిచూస్తున్నాయి.

Read Also: Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ ఆచూకీ పై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా

Iran War: Indian oil companies lose Rs. 2 thousand crores per day

హై-రిస్క్ జోన్‌లలో రవాణా ఖర్చులు

ఇందులో డీజిల్ మీద రూ. 1,650 కోట్లు, పెట్రోల్‌పై రూ. 350 కోట్లు నష్టం నమోదవుతున్నట్లు అంచనా వేసింది. OMCల నష్టానికి ప్రధాన కారణం పెరిగిన అంతర్జాతీయ ముడి చమురు ధరలు, హై-రిస్క్ జోన్‌లలో రవాణా ఖర్చులు, ట్యాంకర్ రేట్లు, బీమా ప్రీమియంలు, అంతర్జాతీయ మార్కెట్‌లో అస్థిరత. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా హర్మూజ్ జలసంధి దగ్గర రవాణా సమస్యలు ఏర్పడ్డాయి. అయితే అమెరికా.. రష్యన్ చమురు కొనుగోలుకు భారత్‌కు 30 రోజుల మినహాయింపును కూడా జారీ చేసింది. అయినప్పటికీ లండన్ డేటెడ్ బ్రెంట్‌కి 2 డాలర్ల నుంచి 8 డాలర్ల ప్రీమియంలతో రష్యన్ చమురు సరఫరా చేయబడింది.

LNG సరఫరా నిలిపివేయబడడంతో గ్యాస్ ధరలు 50 శాతం పెరిగాయి

మరోవైపు ఖతార్ నుండి LNG సరఫరా నిలిపివేయబడడంతో గ్యాస్ ధరలు 50 శాతం పెరిగాయి. ఇది భారతదేశంలో LPG, గ్యాస్ యుటిలిటీ కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపింది. LPG సరఫరాలో సుమారు 25 శాతం కోత తాత్కాలికంగా ఏర్పడింది. దాంతో వంట గ్యాస్ కొరత, ధరల పెరుగుదల సమస్యలు కొంతమంది వినియోగదారులకు కనిపించాయి. సిస్టమాటిక్స్ విశ్లేషణ ప్రకారం.. ఈ పరిస్థితుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, పెట్రోనెట్ PLNG, డీప్ ఇండస్ట్రీస్, గల్ఫ్ ఆయిల్‌లకు దీర్ఘకాలిక ప్రాధాన్యత ఉంది. OMCల నష్టాలు పెరిగినా, అప్‌స్ట్రీమ్ చమురు ఉత్పత్తి కంపెనీలు బలమైన స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. GRMలు $20/bblకి పైగా పెరగడం, ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు 40 డాలర్ల నుంచి 80/bbl డాలర్ల స్థాయిలలో ఉండడం.. పరిశ్రమలో స్థిరమైన లాభాలను చూపుతోంది. దేశీయ LPG సరఫరాలో 25 శాతం కోత పడటంతో గ్యాస్ వినియోగ కంపెనీలపై స్వల్ప ప్రభావం ఏర్పడింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

2000 Crores BPCL Crude Oil Daily Loss Energy Sector financial loss Fuel Prices global oil market HPCL IOCL Petrol Diesel Crisis Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.