📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: India భారత్‌ నచ్చలేదంటూ వెళ్లిపోతున్న కోటీశ్వరులు

Author Icon By Vanipushpa
Updated: August 25, 2025 • 4:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశం(India) విడిచి వెళ్ళే ధనవంతుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. వీరంతా ఇండియాలో డబ్బులు సంపాదించుకుని విదేశాల్లో స్థిరపడుతున్నారు. 2024 ఏడాదిలోనే దాదాపు 2.06 లక్షలకు పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని(Citizenship) వదులుకున్నారు. దేశం విడిచి వెళ్ళే వారిలో ఎక్కువ మంది HNW అంటే అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఈ షాకింగ్ విషయాలను హెన్లీ & పార్టనర్స్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. 2025 సంవత్సరంలో దాదాపు 3,500 మంది మిలియనీర్లు భారతదేశం విడిచివెళ్లడానికి రెడీగా ఉన్నారు. వారి మొత్తం సంపద 26.2 బిలియన్ల డాలర్లు. 2023లో కూడా 4,300 మంది మిలియనీర్లు దేశం విడిచి వెళ్ళారు. 2011 నుండి, 17.5 లక్షల మంది భారతీయులు తమ పాస్‌పోర్ట్‌ల(Passport)ను వదులుకున్నారని ఈ నివేదిక తెలిపింది. 2011 నుండి ఇప్పటివరకు మొత్తం 17 లక్షల 50 వేల మంది భారతీయులు తమ పాస్‌పోర్ట్‌లను వదిలిపెట్టారని నివేదిక చెబుతోంది.

India భారత్‌ నచ్చలేదంటూ వెళ్లిపోతున్న కోటీశ్వరులు

రూ.50 లక్షలకుపైగా ఆదాయపు పన్ను చెల్లించాం

అయితే చాలా మంది మిలియనీర్లు భారతదేశాన్ని ఎందుకు వదిలి వెళ్తున్నారు? భారతదేశంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కలుగుతున్నాయి. మెరుగైన జీవితం, మంచి ఆరోగ్య సేవలు, పని, వ్యాపార అవకాశాలు, తక్కువ పన్నులు, భద్రత వంటి కారణాల వల్ల ధనవంతులు ఇతర దేశాలకు తరలిపోతున్నారని హెన్లీ & పార్టనర్స్ చెబుతున్నారు. విదేశాలలో స్థిరపడటానికి ప్రధాన కారణాలను కూడా వారు వివరిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్టుగా ఇక్కడ పన్నులు చెల్లించిన ప్రతిఫలం సాధారణ ప్రజలకే కాకుండా సంపన్నులకు కూడా అందడం లేదని తెలుస్తోంది. ఐర్లాండ్‌కు వలస వెళ్లిన వనిత మాట్లాడుతూ..మేము సంవత్సరానికి రూ.50 లక్షలకుపైగా ఆదాయపు పన్ను చెల్లించాం. కానీ దానికి ప్రతిగా భద్రత, ఆరోగ్యం, విద్య వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లభించలేదు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఇక్కడ పరిస్థితులు చాలా వెనుకబడ్డాయని చెప్పుకొచ్చారు.

భారతీయ ధనవంతులంతా విదేశాల వైపు మొగ్గు

భారత పాస్‌పోర్ట్ హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 76వ స్థానంలో ఉంది. దీని ద్వారా కేవలం 58 దేశాలకు మాత్రమే వీసా రహిత యాక్సెస్ ఉంటుంది. దానికి విరుద్ధంగా US (193 దేశాలు), సింగపూర్ (192), కెనడా (186) పాస్‌పోర్ట్‌లు మరింత బలమైన మొబిలిటీని ఇస్తాయి. ఈ కారణంగా చాలామంది సంపన్నులు పాస్‌పోర్ట్ మార్పునే పెద్ద ప్రాధాన్యంగా చూస్తున్నారని నివేదిక తెలిపింది. అలాగే దుబాయ్, సింగపూర్, పోర్చుగల్, మాల్టా వంటి దేశాలు తక్కువ పన్నులు, నివాసం ఉండేందుకు సులభమైన హక్కులు, పెట్టుబడి ద్వారా పౌరసత్వం వంటి అవకాశాలను అందిస్తున్నాయి. దీంతో భారతీయ ధనవంతులంతా విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక విదేశీ విశ్వవిద్యాలయాలు, పరిశోధనావకాశాలు, స్థిరమైన ఆర్థిక వాతావరణం ఈ వలసలకు ప్రధాన ఆకర్షణలుగా మారాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు మెరుగైన భవిష్యత్తు కల్పించాలన్న ఉద్దేశంతో విదేశీ పౌరసత్వాన్ని ఎంచుకుంటున్నారని ఈ నివేదిక తేల్చి చెప్పింది. UAEలో వ్యక్తిగత ఆదాయపు పన్ను 0%, కార్పొరేట్ పన్ను 9% మాత్రమే. కానీ భారతదేశంలో వ్యక్తిగత ఆదాయ పన్నులు అధికంగా ఉండగా, కార్పొరేట్ పన్నులు తక్కువగా ఉంటాయి.

ఇండియా  పేర్లు ఏమిటి?
భారత గణతంత్ర రాజ్యం ప్రధానంగా రెండు అధికారిక సంక్షిప్త పేర్లతో పిలువబడుతుంది: ఇండియా మరియు భారత్. అనధికారిక మూడవ పేరు హిందూస్తాన్, ఇది ఉత్తర భారతదేశం అంతటా విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ఈ పేర్లు ఇప్పుడు చాలా సందర్భాలలో ఆధునిక దేశాన్ని సూచిస్తున్నప్పటికీ, అవి చారిత్రాత్మకంగా విస్తృత భారత ఉపఖండాన్ని సూచిస్తాయి.
భారతదేశం పూర్తి పేరు ఏమిటి?
దేశం యొక్క అధికారిక పేరు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. భారతదేశం హిందీ మరియు ఇతర భారతీయ భాషలలో భారత్ అని కూడా పిలువబడుతుంది, దేశ రాజ్యాంగం రెండు పేర్లను గుర్తిస్తుంది. "ఇండియా" అనే పేరు సింధు నది నుండి ఉద్భవించింది, అయితే "భారత్" అనే పేరు భారతీయ సంప్రదాయంలో పురాతన మూలాలను కలిగి ఉంది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/delhi-cm-sensational-details-of-the-attack-case-on-rekha-gupta/national/535576/

Economy india Latest News Breaking News migration Millionaires NRIs Telugu News Wealthy Indians

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.