📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: California:డ్రగ్స్ మత్తులో వాహనాలను ఢీకొట్టిన భారతీయుడు..ముగ్గురు మృతి

Author Icon By Vanipushpa
Updated: October 23, 2025 • 4:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియా నుంచి అమెరికా వెళ్లిన అక్రమ వలసదారు ఆ దేశంలో ముగ్గురు చావుకి కారణమైయ్యాడు. కాలిఫోర్నియా(California)లోని ఒంటారియోలో 10వ ఫ్రీవేపై డ్రగ్స్ మత్తులో ట్రక్ నడిపిన 21 ఏళ్ల జషన్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి భారీ రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, యాలబ్ సిటీకి చెందిన జషన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకొని మితిమీరిన వేగంతో ట్రక్‌ను నడుపుతున్నాడు. ట్రాఫిక్‌లో నెమ్మదిగా కదులుతున్న ముందున్న వాహనాలను ఢీకొట్టాడు. హై స్పీడ్‌లో వచ్చి.. బ్రేక్ వేయకుండా ముందున్న వాహనాలను ఢీకొట్టాడని కాలిఫోర్నియా హైవే పెట్రోల్ పేర్కొంది. దీంతో ఈ రోడ్డు ప్రమాదంలో కార్లు, ట్రక్కులు ఒకదానికోటి అలా ఢీకొని భారీ ట్రక్కులు, కార్లు ధ్వంసమయ్యాయి.

Read Also: Rahul Gandhi : మహాకూటమి పోస్టర్లలో రాహుల్‌ ఫొటో మాయం..

California

సీసీకెమెరాలో రోడ్డు ప్రమాదం రికార్డ్

ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. ఈ భయంకరమై రోడ్డు ప్రమాదం ట్రక్‌లోని సీసీకెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో వైరల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో జషన్ ప్రీత్ సింగ్ వ్యవహారం కలకలం రేపింది. ఇతను అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వలసదారుడని, మార్చి 2022లో బైడెన్ పరిపాలనలో కాలిఫోర్నియా సరిహద్దు వద్ద పట్టుబడి విడుదలయ్యాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల డ్రైవింగ్ లైసెన్సుల జారీ, వారిపై పర్యవేక్షణ గురించి తీవ్ర చర్చకు దారితీసింది.

హత్య వంటి అభియోగాలపై కేసులు నమోదు

జషన్ ప్రీత్ సింగ్‌పై డ్రగ్స్ తీసుకొని డ్రైవింగ్, హత్య వంటి అభియోగాలపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. ఈ విధ్వంసకర ప్రమాదం అమెరికాలో అక్రమ వలసదారుల భద్రతా ప్రమాణాలు, డ్రైవింగ్ సామర్థ్యాలపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం అయ్యేలా చేసింది. గతంలో ఫ్లోరిడాలోనూ భారతీయ అక్రమ ట్రక్ డ్రైవర్ హర్జిందర్ సింగ్ నిర్లక్ష్యంతో ముగ్గురు మరణించిన ఘటన తర్వాత, తాజాగా జరిగిన ఈ ప్రమాదం అమెరికాలో వలస విధానాలపై కఠిన వైఖరి అవసరమనే వాదనకు బలం చేకూర్చింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

car accident Crime News Drug Influence drunk driving Indian Driver Latest News Breaking News Public Safety Road Accident Telugu News Traffic Collision

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.