📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

INDIA-PAKISTAN: పాక్‌కి భారత్ ఆర్మీ గట్టి బుద్ధి.. కేవలం 3 నిమిషాల్లో 13 ఉగ్ర స్థావరాల ధ్వంసం

Author Icon By Shobha Rani
Updated: May 21, 2025 • 12:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరిట పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం కేవలం 3 నిమిషాల్లో 13 శత్రు స్థావరాలను ధ్వంసం చేసింది. అందుకు ప్రతిగా పాక్ కూడా ఎదురు కాల్పులకు తెగబడింది. డ్రోన్లు, మిస్సైళ్లతో భారత్​పై దాడులకు యత్నించింది. ఆ సమయంలో పూంచ్​లోని నియంత్రణ రేఖపై ఉన్న ఎత్తైన ఆర్మీ పోస్ట్​పై దాడులకు పాల్పడింది. అప్పుడు భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. కేవలం 3 నిమిషాల్లోనే 13 శత్రు స్థావరాలను ధ్వంసం చేసింది.
ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లపై దృష్టి
ఆ కథనం ప్రకారం, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్​లోని ఓ కొండపై ఉగ్రవాద లాంచ్‌ ప్యాడ్​లు ఉన్నాయని భారత కల్నల్ ఒకరు తెలిపారు. అక్కడి నుంచి మే 6-7వ తేదీ మధ్య రాత్రి పూంచ్ పోస్ట్​పై పాక్ ఆర్మీ సైన్యం రెండు మోర్టార్ బాంబులను ప్రయోగించిందని పేర్కొన్నారు. వెంటనే స్పందించిన భారత సైన్యం వాటిని తిప్పికొట్టిందని చెప్పారు. కేవలం 3 నిమిషాల్లోనే పాక్​కు చెందిన 13 బంకర్లను పేల్చిసిందని వెల్లడించారు. 10,000 అడుగుల ఎత్తులో ఉన్న పూంచ్ పోస్ట్​లో జరిగిన ఆ దాడి సమయంలో భారత సైన్యం ఫిరంగి, షోల్డర్​ ఫైర్డ్​ క్షిపణులు, మోర్టార్ కాల్పులతో తీవ్రంగా దాడి చేసినట్లు ఆయన వివరించారు.

INDIA-PAKISTAN: పాక్‌కి భారత్ ఆర్మీ గట్టి బుద్ధి.. కేవలం 3 నిమిషాల్లో 13 ఉగ్ర స్థావరాల ధ్వంసం

“ఈ దాడి పాక్‌కు గుణపాఠం”
ప్రతి భారత ఆర్మీ జవాన్​కు ఏ ఆయుధాన్ని ఉపయోగించాలో తెలుసు. మే 6, 7వ తేదీ మధ్య రాత్రి శత్రువు చేసిన తప్పుకు ఇండియన్ ఆర్మీ దీటుగా బదులిచ్చింది. దీంతో వారు మళ్లీ ఇలాంటి పని చేసే ముందు 100 సార్లు ఆలోచించే విధంగా పాకిస్థాన్ (Pakistan) సైన్యానికి బుద్ధి చెప్పాం. అని కల్నల్ వ్యాఖ్యానించారు. మరోవైపు, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్థాన్ ఆర్మీ ఫార్వర్డ్ పోస్టులను లక్ష్యంగా చేసుకోవడానికి ఇండియన్ ఆర్మీ మీడియం మెషిన్ గన్స్ ఉపయోగించిందని సైనికుడు ఒకరు తెలిపారు. పాక్ దురాక్రమణపై ఇండియన్ ఆర్మీ త్వరగా స్పందించి దీటుగా బదులు ఇచ్చిందని చెప్పారు. ఈ సంఘటన మే 7-8 మధ్య రాత్రి జరిగింది. పాక్ (Pak) కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దీంతో మేము సెకన్ల వ్యవధిలోనే ప్రతిస్పందించాం. పాక్ బంకర్లను, లాంచింగ్ ప్యాడ్‌ లను ధ్వంసం చేశాం. శత్రువుకు భారీ ప్రాణనష్టం కలిగించాం. అని పేర్కొన్నారు.
డ్రోన్ల దాడికి విఫలయత్నం
పాక్ (Pak) సైన్యం మన పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించింది. డ్రోన్లను కూడా ప్రయోగించారు. కానీ డ్రోన్లు వేరే దేశం నుంచి తెచ్చుకున్నవి కాబట్టి వాటిని ప్రయోగించడానికి వారు సరైన శిక్షణ పొందలేదు. వాటిని విజయవంతంగా కూల్చేశాం. మే 7న తెల్లవారుజామున 1.30 నుంచి 2 గంటల వరకు పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. వారు మన పౌరులను లక్ష్యంగా చేసుకోవడం అతిపెద్ద నేరం. తదుపరి 10 నిమిషాల్లో మేము వారి ఫార్వర్డ్ పోస్టులు, లాంచింగ్ ప్యాడ్‌ లను ధ్వంసం చేశాం. అని సైనికుడు ఒకరు తెలిపారు.పాక్ సైన్యం భారత పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ల ద్వారా దాడి చేసేందుకు యత్నించింది. కానీ డ్రోన్లు వేరే దేశాల నుంచి తెచ్చినవే, సరైన శిక్షణ లేకపోవడంతో విఫలమయ్యాయి.

Read Also: Pakistan: పాకిస్తాన్‌లో స్కూల్ బస్సుపై కారు బాంబు దాడి, నలుగురు పిల్లలు మృతి

Breaking News in Telugu Destruction of 13 terrorist bases in just 3 minutes Google news Google News in Telugu Indian Army is strong minded for Pakistan.. Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.