KP George: మనీల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ అమెరికన్ న్యాయమూర్తి కేపీ జార్జ్ చిక్కుల్లో పడ్డారు. టెక్సాస్ ఫోర్ట్ బెండ్ కౌంటీకి చెందిన ఈయనపై నమోదైన పార్టీ నిధుల దుర్వినియోగం అభియోగాలు విచారణలో నిజమేనని తేలింది. ఈ మేరకు జ్యూరీ ఆయనను దోషిగా నిర్ధారిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆయనకు జూన్ 16న శిక్షను ఖరారు చేయనున్నట్లు కోర్టు వెల్లడించింది.
Read Also: Nuclear Threat to India: భారత్‌కు పాక్ అణు ముప్పు!
నిధుల మళ్లింపు, అభియోగాలు
కేపీ జార్జ్ తన ఎన్నికల ప్రచార నిధులను సొంత అవసరాలకు వాడుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సుమారు 46 వేల డాలర్లను (భారత కరెన్సీలో దాదాపు రూ. 38 లక్షలు) తన వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే గతేడాది ఏప్రిల్‌లో ఆయన్ను కోర్టు రూమ్ నుంచే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 20 వేల డాలర్ల పూచీకత్తుపై ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు.

న్యాయమూర్తిపై వచ్చిన అభియోగాలను విచారించిన జ్యూరీ.. మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్టు నిర్ధారించి, దోషిగా తేల్చింది. కానీ, టెక్సాస్ స్థానిక చట్టం ప్రకారం.. దోషిగా నిర్దరణ అయినా శిక్ష ఖరారయ్యే వరకు ఆయన న్యాయమూర్తిగా కొనసాగే అవకాశం ఉంటుంది.
KP George: ఎవరీ కేపీ జార్జ్ ?
డెమొక్రాట్ మద్దతుదారుడైన కేపీ జార్జ్.. 2018 నుంచి ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్జిగా పనిచేస్తున్నారు. 2022లోనూ రెండోసారి ఈ పదవికి ఆయన ఎన్నికయ్యారు. భారతీయ మూలాలు కలిగిన జార్జ్.. కేరళలో జన్మించారు. విద్యాభ్యాసం కూడా ఇండియాలోనే పూర్తిచేశారు. 1993లో అమెరికాకు వలసవెళ్లిన కేపీ జార్జ్.. న్యూయార్క్‌లోని ఓ ఫైనాన్షియల్ కంపెనీలో కెరీర్ ప్రారంభించారు. క్రమంగా వివిధ సంస్థల్లో పనిచేస్తూ.. టెక్సాస్‌లో స్థిరపడ్డారు. స్థానిక రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి, టెక్సాస్‌లో ఎన్నికైన అత్యంత ప్రముఖ భారతీయ-అమెరికన్ ప్రజాప్రతినిధులలో ఒకరిగా నిలిచారు. ఆ ప్రాంత రాజకీయాల్లో పెరుగుతున్న ప్రవాస భారతీయుల ప్రభావాన్ని ప్రతిబింబించే ఒక కీలక వ్యక్తిగా ఆయనను పరిగణిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: