📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Donald Trump : డొనాల్డ్ ట్రంప్-పుతిన్ చర్చలను స్వాగతించిన భారత్

Author Icon By Divya Vani M
Updated: August 9, 2025 • 10:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ రాజకీయాల్లో మూడు రోజులుగా వేగంగా మారుతున్న పరిణామాలు, ఇప్పుడు ఒక కీలక మలుపు తీసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ August 15న అలస్కాలో ప్రత్యక్షంగా సమావేశం (Vladimir Putin to meet in person in Alaska on August 15) కాబోతున్నారు.ఈ వార్తను ట్రంప్ స్వయంగా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో ప్రకటించడంతో, ఇది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం కారణంగా నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతలకు ఈ భేటీ ఒక పరిష్కారం కావచ్చని ఆశలు వ్యక్తమవుతున్నాయి.శాంతికి ఇదొక తొలి అడుగుగా విశ్లేషకులు చెబుతున్నారు.అమెరికా – రష్యా మధ్య ఈ శిఖరాగ్ర సమావేశాన్ని భారత్ హర్షంగా స్వాగతించింది.ఇది యుద్ధాల యుగం కాదు, అని ప్రధాని మోదీ అనేకసార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు.భారత్ శాంతిని కోరుకుంటుందని, యుద్ధానికి కాకుండా పరిష్కారానికి తోడ్పడాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు.

చమురు కొనుగోలుపై నిర్ణయం తీసుకునే అవకాశం

ఈ భేటీ భారత్‌కు కూడా ప్రాధాన్యత కలిగినదే.రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై అమెరికా విధించిన 25% అదనపు సుంకం అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రావచ్చని అంచనా.ఈ భేటీ ద్వారా భారత్‌పై సుంక భారం తగ్గే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.ఈ సమావేశానికి ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు.ఉక్రెయిన్ అంశంపై అమెరికాతో జరిగిన చర్చల వివరాలు మోదీకి వెల్లడించారు.
ఈ సమాచారం పంచుకోవడం ద్వారా భారత్-రష్యా మధ్య ఉన్న దోస్తీ బంధం మరింత బలపడిందని తెలుస్తోంది.

స్టీవెన్ విట్కాఫ్ చర్చల ప్రభావం

అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక దూత స్టీవెన్ విట్కాఫ్ ఇటీవల మాస్కోలో పుతిన్‌ను కలవడం ద్వారా ఈ భేటీకి మూడో దశ వేయబడింది.విట్కాఫ్‌తో జరిగిన చర్చలు పాజిటివ్‌గా సాగాయని ట్రంప్ తెలిపారు.ట్రంప్ చేసిన “ఇరు దేశాల ప్రయోజనాల కోసం భూభాగాల మార్పిడి జరిగే అవకాశం ఉంది” అనే వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇది ఉక్రెయిన్‌కు ఆమోదయోగ్యమా? అనే కోణంలో ప్రశ్నలు మొదలయ్యాయి.

Read Also : రేపు బెంగళూరులో నమ్మ మెట్రో ఎల్లో లైన్ ప్రారంభించనున్న మోదీ

Alaska summit news India-Russia oil deal Modi-Putin conversation Trump-Putin meeting Ukraine war resolution US-Russia summit 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.