📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan: పాక్ పై భారత్ హెచ్చరికలు నిజమే.. ఆ దేశ ఆర్థిక కష్టాలు..

Author Icon By Vanipushpa
Updated: August 13, 2025 • 4:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్(Pakistan) విషయంలో భారత్(India) ఎప్పటినుంచో వ్యక్తం చేస్తున్న ఆందోళనలు, వాదనలు మరోసారి నిజమయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)(IMF) నుంచి 7 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీ పొందేందుకు విధించిన షరతుల్లో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైంది. నిర్దేశించిన ఐదు కీలక లక్ష్యాలలో మూడింటిని అందుకోలేకపోయింది. ఐఎంఎఫ్ నిబంధనలను పాటించడంలో పాకిస్థాన్‌కు చెత్త రికార్డు ఉందని, ఆ దేశం తరచూ రుణాలు తీసుకుంటుందని భారత్ చేస్తున్న వాదనలకు ఈ పరిణామం బలం చేకూర్చింది.

పాకిస్థాన్‌కు చెందిన ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక తన కథనంలో ..

పాకిస్థాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (ఎఫ్‌బీఆర్) రెండు ప్రధాన ఆర్థిక లక్ష్యాలను చేరుకోలేకపోయింది. మొత్తం 12.3 లక్షల కోట్ల రూపాయల రాబడిని సేకరించడంలో విఫలమైంది. అంతేకాకుండా, రిటైలర్లపై పన్ను విధించేందుకు ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ‘తాజిర్ దోస్త్ పథకం’ ద్వారా 50 బిలియన్ రూపాయలు సమీకరించాలన్న లక్ష్యం కూడా నెరవేరలేదు. ఈ పథకం పూర్తిగా విఫలమైనట్లు పాకిస్థాన్‌కు చెందిన ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక తన కథనంలో పేర్కొంది. దీనికి తోడు, జూన్‌తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో పాక్‌లోని రాష్ట్రాలు కూడా అధిక వ్యయాల కారణంగా 1.2 లక్షల కోట్ల రూపాయలను ఆదా చేయడంలో విఫలమైనట్లు ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది.

Pakistan: పాక్ పై భారత్ హెచ్చరికలు నిజమే.. ఆ దేశ ఆర్థిక కష్టాలు

నైతిక విలువలకు సరైన ప్రాధాన్యత

ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి పాకిస్థాన్‌కు అందే నిధులను ఆ దేశం సైనిక అవసరాలకు, సరిహద్దు ఉగ్రవాద కార్యకలాపాలకు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని భారత్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. గత ఐఎంఎఫ్ సమావేశంలో భారత ప్రతినిధి పరమేశ్వరన్ అయ్యర్ మాట్లాడుతూ, “ప్రపంచ ఆర్థిక సంస్థలు అనుసరించే విధానాల్లో నైతిక విలువలకు సరైన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ తీవ్రమైన లోటు స్పష్టం చేస్తోంది” అని తెలిపారు.

ఆర్థిక వ్యవస్థపై సైన్యం పట్టు

పాకిస్థాన్ పదేపదే ఐఎంఎఫ్ నుంచి రుణాలు తీసుకుంటోందని, కానీ వాటి షరతులను అమలు చేయడంలో ఎప్పుడూ విఫలమవుతోందని భారత్ ఎత్తిచూపింది. గతంలో తీసుకున్న ప్యాకేజీలు సరైన ఫలితాలనిచ్చి ఉంటే, పాకిస్థాన్ మళ్లీ బెయిలౌట్ కోసం ఐఎంఎఫ్ వద్దకు రావలసిన పరిస్థితి ఉండేది కాదని పేర్కొంది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవహారాల్లో సైన్యం జోక్యం చేసుకోవడం వల్లే విధానపరమైన లోపాలు తలెత్తుతున్నాయని, సంస్కరణలు వెనక్కి వెళుతున్నాయని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అక్కడ పౌర ప్రభుత్వం ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థపై సైన్యం పట్టు కొనసాగుతోందని, స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫెసిలిటేషన్ కౌన్సిల్‌లో కూడా సైన్యమే కీలక పాత్ర పోషిస్తోందని గుర్తుచేసింది. రాజకీయ కారణాల వల్లే పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ పదేపదే రుణాలు ఇస్తోందనే అభిప్రాయం ఉందని భారత్ విశ్లేషించింది.

పాకిస్తాన్ మరియు భారతదేశం యొక్క చరిత్ర ఏమిటి?
భారతదేశం-పాకిస్తాన్ సంబంధాలు

1947 నుండి, భారతదేశం మరియు పాకిస్తాన్ మూడు ప్రధాన యుద్ధాలు మరియు ఒక అప్రకటిత యుద్ధంలో పాల్గొన్నాయి మరియు అనేక సాయుధ ఘర్షణలు మరియు సైనిక ప్రతిష్టంభనలలో కూడా పాల్గొన్నాయి.
1960లో పాకిస్తాన్‌లో ఏం జరిగింది?
జనరల్ అయూబ్ ఖాన్ ఫిబ్రవరి 14, 1960న 96 శాతం ఓట్లతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మరియు ఫిబ్రవరి 17, 1960న ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/khalistani-attack-on-hindu-temple-in-usa/national/529902/

diplomatic warning India Pakistan Relations International Relations Latest News Breaking News Pakistan economic crisis South Asia politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.