📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

Trump: భారత్–అమెరికా ట్రేడ్ డీల్..మన వ్యవసాయ రంగానికి ముప్పు..?

Author Icon By Vanipushpa
Updated: February 4, 2026 • 12:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నెలల తరబడి సాగిన చర్చల అనంతరం భారత్-అమెరికా(India-America) వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఒకే అయింది. ఈ ఒప్పందం ప్రారంభ దశ నుంచే దేశంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ముఖ్యంగా, అమెరికా ప్రభుత్వం భారతదేశ వ్యవసాయం, పాడి రంగాలను పూర్తిగా తెరవాలని డిమాండ్ చేయడం రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన కీలక చర్చల అనంతరం ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు. భారతదేశంపై అమెరికా విధించిన 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, భారతదేశం కూడా అమెరికన్ వస్తువులపై సుంకాలను క్రమంగా తగ్గించి, కొన్ని ఉత్పత్తులపై సున్నా సుంక విధానం అమలు చేసే దిశగా ముందుకు వెళ్తుందని తెలిపారు.

Read Also: T20 WC: టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ

Trump: భారత్–అమెరికా ట్రేడ్ డీల్..మన వ్యవసాయ రంగానికి ముప్పు..?

రోలిన్స్ తెలిపిన వివరాల ప్రకారం..

అయితే, ఈ ఒప్పందంలో వ్యవసాయం, పాడి రంగాలు పూర్తిగా తెరుచుకుంటాయా లేదా అనే అంశంపై ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. కానీ అమెరికా వ్యవసాయ కార్యదర్శి బ్రూక్ రోలిన్స్ చేసిన ప్రకటన మాత్రం భారతదేశంలో తీవ్ర చర్చకు దారితీసింది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం అమలులోకి రావడం ద్వారా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశంలోని భారీ మార్కెట్‌కు చేరుతాయని.. ఇది గ్రామీణ అమెరికాకు భారీ ఆర్థిక లాభాలను తీసుకువస్తుందని X (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. రోలిన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. 2024 నాటికి భారతదేశంతో అమెరికా వ్యవసాయ వాణిజ్య లోటు 1.3 బిలియన్ డాలర్లకు చేరనుంది.

భారత రైతులకు సాంకేతికంగా ప్రయోజనం

అమెరికా ఉత్పత్తులతో పాటు.. వ్యవసాయ యంత్రాలు, పరికరాలు కూడా భారతదేశానికి దిగుమతి కావచ్చు. ఇది భారత రైతులకు సాంకేతికంగా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉన్నప్పటికీ, తక్కువ ధరల అమెరికన్ ఉత్పత్తులతో పోటీ పడాల్సి రావడం రైతుల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఒప్పందాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. అమెరికన్ వస్తువులపై సుంకాలు, నాన్-టారిఫ్ అడ్డంకులను తగ్గించడం వల్ల భారతీయ పరిశ్రమలు, చిన్న వ్యాపారులు, రైతులు నష్టపోతారని కాంగ్రెస్ హెచ్చరించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Agricultural Imports farm laws farmers concerns India US relations India US Trade Deal Indian agriculture sector rural economy Telugu News Paper Telugu News Today trade agreement impact

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.