📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

India US tariff: గుడ్ న్యూస్.. భారత్ పై టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్

Author Icon By Aanusha
Updated: February 2, 2026 • 11:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ కు అమేరికా అధ్యక్షుడు ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. టారిఫ్‌లు (India US tariff) 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా భారత ప్రధాని మోదీతో ఆయన మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనర్హం. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు. “ఈ ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. మోదీ నా గొప్ప స్నేహితుల్లో ఒకరు. ఆయన భారత్ లో అత్యంత శక్తిమంతమైన నేత. మేం ఇవాళ ఫోన్ కాల్ లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. వాణిజ్యం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు తదితర అంశాలు చర్చకు వచ్చాయి.

Read Also: Kaja kallas : యూరోపియన్ ఆర్మీ ప్రమాదమా? కాజా కల్లాస్ హెచ్చరిక!

25 శాతం టారిఫ్ లు 18 శాతానికి తగ్గుతాయి

రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసేందుకు మోదీ అంగీకరించారు. అమెరికా నుంచి, దాంతో పాటే వెనెజువెలా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. ఈ నిర్ణయం ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలుకుతుందని ఆశిస్తున్నాను. ప్రతి వారం వేలమంది చనిపోతున్న ఆ యుద్ధానికి ఈ నిర్ణయం చరమగీతం పాడుతుందని అనుకుంటున్నాను. మోదీతో స్నేహం, గౌరవం ఇవన్నీ కాకుండా… ఆయన విజ్ఞప్తి మేరకు అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందానికి ఆమోదం తెలిపాం. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 25 శాతం టారిఫ్ లు 18 శాతానికి తగ్గుతాయి. అదే సమయంలో భారత్ వైపు నుంచి కూడా టారిఫ్ లు తగ్గుతాయనుకుంటున్నాను.

దాంతోపాటే, పూర్తి పన్ను రహిత వాణిజ్యానికి ద్వారాలు తెరుచుకుంటాయని ఆశిస్తున్నాను. అమెరికా తయారీ వస్తువుల కొనుగోలు పట్ల కట్టుబడి ఉంటారని ప్రధాని మోదీ మాటిచ్చారు. ఈ వాణిజ్యం దాదాపు 500 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చు. ఇందులో ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయం, బొగ్గు తదితర ఉత్పత్తులు ఉన్నాయి. భారత్ తో అమెరికా అద్భుతమైన సంబంధాలు మరింత దృఢంగా ముందుకు వెళతాయి. నేను, ప్రధాని మోదీ ఈ ఒప్పందానికి ఓ రూపం కల్పించాం… ఇంతకుమించి ఎక్కువగా చెప్పలేం” అంటూ ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. 

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Donald Trump India USA relations latest news Narendra Modi Tariff Reduction Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.