📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

Trade Deal: భారత్–అమెరికా ఒప్పందంతో ముంచుకొస్తున్న ప్రమాదాలు ఇవే..

Author Icon By Vanipushpa
Updated: February 9, 2026 • 4:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ – అమెరికా మధ్య మధ్యంతర ట్రేడ్ డీల్ (Trade Deal) జరిగిన సంగతి విదితమే. ఈ మేరకు రెండు దేశాలు కూడా సంయుక్త ప్రకటన చేశాయి. అయితే మధ్యంతర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాల సంయుక్త ప్రకటన వ్యవసాయ రంగంలో పలు మార్పులకు వేదికగా నిలుస్తోంది. వ్యవసాయ రంగంలో భారతదేశం తీసుకున్న జాగ్రత్తలు అలాగే ఇచ్చిన రాయితీలు ఓ సారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. అమెరికా నుంచి సోయాబీన్, మొక్కజొన్న, ఇంధన ఇథనాల్, పత్తి, పాల, పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులకు తన మార్కెట్‌ను ఇండియా ఇప్పటికీ తెరవలేదు. భారత రైతులు కోసం ముఖ్యంగా జన్యుమార్పిడి (GM) పంటలు, పాల ఉత్పత్తుల విషయంలో దేశం తీసుకున్న కఠిన వైఖరిని కొనసాగిస్తోందని మోదీ సర్కారు చెబుతోంది.

Read Also: Bengaluru Crime: తల్లి ప్రైవేటు ఫొటోలను ప్రియుడికి పంపిన కూతురు

Trade Deal: భారత్–అమెరికా ఒప్పందంతో ముంచుకొస్తున్న ప్రమాదాలు ఇవే..

రష్యా నుంచి వెనిజులాకు వెళుతున్న భారత్

భారత్ కొన్ని అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులకు సుంకాలు తగ్గించడం లేదా తొలగించడం ద్వారా అదనపు మార్కెట్ ఉత్పత్తులను మంజూరు చేసింది. ఇందులో డిస్టిల్లర్స్ డ్రైడ్ గ్రెయిన్స్ విత్ సోల్యుబుల్స్ (DDGS), సోయాబీన్ నూనె, పశుగ్రాసం కోసం ఎర్ర జొన్న, చెట్ల గింజలు, తాజాగా ప్రాసెస్ చేసిన పండ్లు, వైన్, స్పిరిట్స్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. అలాగే అదనపు ఉత్పత్తులు అనే అస్పష్ట పదాన్ని కూడా ఉపయోగించడం గమనార్హం. మొదట్లో ఇవి భారత రైతులకు పెద్ద ముప్పుగా అనిపించకపోయినా.. DDGS విషయంలో పరిస్థితి అయితే అంత సులభం కాదు. DDGS అనేది మొక్కజొన్న లేదా ఇతర ధాన్యాల నుంచి ఇథనాల్ తయారీ తర్వాత మిగిలే ఉప ఉత్పత్తి. ఇది ప్రోటీన్-రిచ్ పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం భారతీయ పౌల్ట్రీ, పాడి, ఆక్వా ఫీడ్ రంగాలు సోయాబీన్, పత్తిగింజలు, వేరుశనగ లేదా ఆవాల నుండి లభించే డీ-ఆయిల్డ్ కేక్‌పై ఆధారపడుతున్నాయి. ఇవి చాలా ఖరీదైనవి. ట్రంప్ సుంకాల తగ్గింపు.. ప్రతిగా చమురు దిగుమతులకు రష్యా నుంచి వెనిజులాకు వెళుతున్న భారత్.. కారణం ఏంటంటే.. భారతదేశంలో సోయాబీన్ డీ-ఆయిల్డ్ కేక్ కిలో ధర రూ.43-44 ఉండగా.. దేశీయంగా తయారయ్యే బియ్యం లేదా మొక్కజొన్న DDGS ధర రూ.24-30 మధ్యలో ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.