📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Free Trade Deal : భారత్–యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు!

Author Icon By Sudha
Updated: July 24, 2025 • 4:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల యూకే పర్యటనలో భాగంగా (జూలై 24) లండన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో ఆయన కీలకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భారత్-యూకే (India-UK) మధ్య చారిత్రక ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ (Free Trade Deal) పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. కాగా, భారత్‌-యూకేల మధ్య ఈ వాణిజ్య ఒప్పందం (Free Trade Deal)కోసం జరిపిన చర్చలు ముగిసినట్లు ఇరు దేశాలు మే 6న ప్రకటించిన విషయం తెలిసిందే. 2030 నాటికి ఈ రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేసేదిగా ఈ ఒప్పందం ఉంది. తోలు, పాదరక్షలు, దుస్తులు వంటి ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులను తొలగించాలని, బ్రిటన్ నుండి విస్కీ, కార్ల దిగుమతులను చౌకగా మార్చాలని ఈ వాణిజ్య ఒప్పందంలో(Free Trade Deal) పొందుపర్చారు. భారత్‌-యూకేల ఈ ఒప్పందంలో వస్తువులు, సేవలు, ఆవిష్కరణ, మేధో సంపత్తి హక్కులు తదితర అంశాలను ఇందులో ప్రతిపాదించారు.

Free Trade Deal : భారత్–యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు!

అంతకు ముందు యూకే పర్యటనపై ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన చాలా దోహదపడుతుందన్నారు. మన ప్రజలకు శ్రేయస్సు, వృద్ధి ఉద్యోగ సృష్టిని పెంచడంపై దృష్టి ఉంటుందని చెప్పారు. ప్రపంచ పురోగతికి బలమైన భారతదేశం-యూకే స్నేహం చాలా అవసరమని తెలిపారు. ఇక్కడి భారతీయ సమాజం నుంచి లభించిన హృదయపూర్వక స్వాగతం తనను కదిలించిందని వెల్లడించారు. భారతదేశ పురోగతి పట్ల వారి అభిమానం మక్కువ నిజంగా నా హృదయాన్ని తాకిందని ప్రధాని ట్వీట్‌ చేశారు.

భారతదేశం మరియు యుకె మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఏమిటి?

యుకె-ఇండియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఒక ముఖ్యమైన విజయం. ఇది యుకె మరియు భారతీయ వ్యాపారాలకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది, ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత డైనమిక్ మార్కెట్లలో ఒకదానికి ఎక్కువ ప్రాప్యతను కల్పిస్తుంది మరియు యుకె-ఇండియా కారిడార్ అంతటా వృద్ధి మరియు ఆవిష్కరణలను నడిపిస్తుంది.

భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఎవరు?

వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 2013-14 నుండి 2017-18 వరకు మరియు 2020-21లో కూడా చైనా భారతదేశానికి అగ్ర వాణిజ్య భాగస్వామిగా ఉంది. చైనాకు ముందు, యుఎఇ ఆ దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2021-22 నుండి అమెరికా అతిపెద్ద భాగస్వామిగా ఉంది .

భారతదేశంతో అత్యధిక వాణిజ్య మిగులు కలిగి ఉన్న EU దేశం ఏది?

2023-24లో భారతదేశం 27 EU సభ్య దేశాలలో 19 దేశాలతో వాణిజ్య మిగులును కొనసాగించింది. నెదర్లాండ్స్ , స్పెయిన్, ఇటలీ మరియు పోర్చుగల్ వంటి దేశాలు వాణిజ్య మిగులులో అత్యంత ముఖ్యమైన వాణిజ్య సమతుల్యతను కలిగి ఉన్నాయి, ఇది ఈ మార్కెట్లలో భారతదేశం యొక్క పెరుగుతున్న పరిధి మరియు పోటీతత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Supreme Court: అడవులను కాపాడకుంటే మీరు జైలుకే: సుప్రీంకోర్టు

Breaking News Free Trade Agreement India UK Relations India UK Trade Deal Keir Starmer latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.