📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: US: ఇకపై భారత్ రష్యా చమురు కొనదు..ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: October 16, 2025 • 1:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా(Russia) చమురుకు భారత్ (India) అతి పెద్ద కొనుగోలుదారు. దీని కారణంగా ఇరు దేశాలూ లాభం పొందుతున్నాయి. అయితే దీనిని ఆపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (America president Donald Trump) ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యాతో చమురు వ్యాపారం చేస్తూ ఉక్రెయిన్ తో యుద్ధానికి సహాయం చేస్తున్నారంటూ భారత్, చైనాలపై ట్రంప్ చాలాసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చమురు కొనుగోలు ఆపాలని భారత్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా వినకపోయేసరికి ఇండియాపై 50శాతం అదనపు శాతం సుంకాలను కూడా విధించారు. ఈ విషయమై భారత్, అమెరికాల మధ్య చాలా రోజులుగా వివాదం చెలరేగుతోంది. ఇరుదేశాల మధ్యనా వాణిజ్యం ఆగిపోయింది. అయితే మళ్ళీ ఈ మధ్యనే భారత్, అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ట్రంప్ ఈరోజు కీలక వ్యాఖ్యలను చేశారు.

 Read Also: Pak vs Afg: పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో దాడులు..40మంది మృతి

US: ఇకపై భారత్ రష్యా చమురు కొనదు..ట్రంప్

భారత ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారు: ట్రంప్

ఇక మీదట రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని ట్రంప్ అన్నారు. భారత ప్రధాని మోదీ తనకు ఈ రకమైన హామీ ఇచ్చారని తెలిపారు ఉక్రెయిన్ తో జరిగే యుద్ధంలో రష్యా ను ఒంటరి చేయడంలో ఇదొక కీలకమైన అడుగని ట్రంప్ పేర్కొన్నారు. వైట్ హౌస్ మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలను చేశారు. రష్యాతో చమురు వ్యాపారం చేయడంపై మోదీతో మాట్లాడానని..ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. భారత్…రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వలన నిధులు అందుతున్నాయని…దీంతోనే పుతిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని తాము భావిస్తున్నామని ట్రంప్ అన్నారు.

చమురు కొనుగోలుపై భారత్, అమెరికాల మధ్య ఘర్షణ

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై తాను చాలా రోజుల నుంచి సంతోషంగా లేనని ట్రంప్ అన్నారు. ఇదే విషయాన్ని మోదీ దగ్గర వ్యక్తం చేశానని చెప్పారు. ఇక మీదట చమురు కొనుగోలు చేయమని చెప్పారని..తనకు హామీ ఇచ్చారని చెప్పారు. చైనాతో కూడా ఇదే పనిని చేయిస్తానని ట్రంప్ చెప్పారు. చమురు కొనుగోలుపై భారత్, అమెరికాల మధ్య ఘర్షణ ఉన్నమాట వాస్తవమేనని…అయినా కూడా యూఎస్ కు ఇండియా ఎప్పటికీ సన్నిహిత భాగస్వామని వ్యాఖ్యలు చేశారు. మోదీతో తనకు గొప్ప స్నేహితుడని…తమ మధ్య మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై భారత్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Donald Trump Energy Security Geopolitics india India-Russia relations Latest News Breaking News Oil Trade russia Sanctions Telugu News US foreign policy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.