📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: India: హసీనా ప్రాణం కాపాడిన ఫోన్ కాల్

Author Icon By Sushmitha
Updated: November 7, 2025 • 5:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత ఏడాది బంగ్లాదేశ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక అల్లర్ల సమయంలో, అప్పటి ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేశం నుంచి తప్పించుకుని భారత్‌కు వచ్చారు. ముష్కరుల దాడి నుంచి ఆమె కేవలం 20 నిమిషాల వ్యవధిలో సురక్షితంగా బయటపడటానికి, భారత్(India) నుంచి వచ్చిన ఒక రహస్య ఫోన్ కాల్ కారణమని చెబుతూ త్వరలో ఒక పుస్తకం విడుదల కానుంది. ‘ఇన్షా అల్లా బంగ్లాదేశ్: ది స్టోరీ ఆఫ్ ఆన్ అన్‌ఫినిష్డ్ రెవెల్యూషన్’ అనే పేరుతో రానున్న ఈ పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలు పొందుపరిచారు.

Read Also: Pawan Kalyan: పల్లె రోడ్ల స్థితిగతులపై కొత్త సిస్టమ్: ఉప ముఖ్యమంత్రి

India

భారత్ నుంచి వచ్చిన కీలక కాల్

2024 ఆగస్టు 4న మధ్యాహ్నం 1:30 గంటలకు భారత్ నుంచి వచ్చిన ఆ ఫోన్ కాల్ హసీనాతో బాగా పరిచయమున్న ఒక ఉన్నతాధికారి చేశారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఆ అధికారి “ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెంటనే గణభవన్‌ను వీడకపోతే ప్రాణాలకు ముప్పు తప్పదు” అని హసీనాను అప్రమత్తం చేశారు. భవిష్యత్తులో పోరాటం చేయాలంటే ప్రాణాలతో ఉండటం ముఖ్యమని సూచించారని ఆ పుస్తకంలో ఉంది.

తప్పించుకున్న వైనం, ఆశ్రయం

ఆ మాటలకు షాక్ తిన్న హసీనా, బంగ్లాదేశ్‌ను విడిచి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ, దేశం విడిచి వెళ్ళే ముందు ప్రసంగాన్ని రికార్డు చేయాలని భావించారు. అయితే, నిరసనకారులు ఏ క్షణమైనా లోపలకి చొచ్చుకు వచ్చే అవకాశం ఉండటంతో ఆర్మీ అధికారులు నిరాకరించారు. అనంతరం ఆమె సోదరి రెహానా, హసీనాను బలవంతంగా కారులో కూర్చోబెట్టారు. మధ్యాహ్నం 2:33 గంటలకు చాపర్ బంగ్లాదేశ్‌లో టేకాఫ్ అయి, అరగంటలో భారత్‌లో దిగింది. అప్పటి నుంచి ఢిల్లీలో ఆమెకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోంది. ఆ రోజు భారత్ నుంచి ఫోన్ కాల్ రాకపోతే ఆమె కూడా తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్‌లాగే హత్యకు గురయ్యేవారని ఆ పుస్తకంలో ఆందోళన వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

bangladesh coup attempt Google News in Telugu india Indian phone call Insha Allah Bangladesh Latest News in Telugu political unrest Sheikh Hasina Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.