📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India : పాకిస్థాన్‌ జాతీయులకు వీసా సేవలు నిలిపివేసిన భారత్

Author Icon By sumalatha chinthakayala
Updated: April 24, 2025 • 5:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

India : పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్థాన్‌పై గట్టిగా స్పందించింది. ఈ పరిణామాల్లో భాగంగా,భారత ప్రభుత్వం పాకిస్థాన్ పౌరులకు ఇచ్చే వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. మెడికల్ వీసాలు సహా,ఇప్పటికే పాక్ పౌరులకు జారీ చేసిన అన్ని రకాల వీసాలను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్నిగురువారం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది .ఇప్పటికే వీసాలు పొందినవారికి ఈ నెల 27వ తేదీ వరకు గడువు విధించినట్లు స్పష్టం చేసింది. అయితే మెడికల్ వీసాలు కలిగిన వారికి మాత్రం కొంత ఊరటనిచ్చింది. వారికీ ఈ నెల 29వ తేదీ వరకు గడువు ఇచ్చింది. వీసా గడువు ముగిసేలోపు భారత్‌ను తప్పనిసరిగా వదిలి తమ స్వదేశాలకు వెళ్లిపోవాలంటూ కేంద్రం ఆదేశించింది.

వీసా గడువు ముగిసేలోపు వారు భారతదేశాన్ని వీడాలి

పాకిస్థాన్ పౌరులకు వీసా సేవలు నిలిపివేయబడ్డాయి. ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాక్ పౌరులకు జారీ చేసిన అన్ని వీసాలు రద్దు చేయబడ్డాయి. సాధారణ వీసాలు ఏప్రిల్ 27 వరకు చెల్లుబాటు అవుతాయి. మెడికల్ వీసాలు మాత్రం 29వ తేదీ వరకు మాత్రమే విలువైనవిగా పరిగణించబడతాయి. వీసా గడువు ముగిసేలోపు వారు భారతదేశాన్ని వీడాల్సి ఉంటుంది అని ప్రకటనలో పేర్కొంది. ఇక భారత పౌరుల విషయానికి వస్తే, కేంద్రం వారికి కూడా కీలక సూచనలు చేసింది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఎవరూ పాకిస్థాన్‌కి ప్రయాణించకూడదని హెచ్చరించింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న భారతీయులు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి తిరిగి భారత్‌కి రావాలని సూచించింది.

Read Also: అన్ని పార్టీలను అఖిలపక్ష భేటీకి ఆహ్వానించాలి: అసదుద్దీన్‌ ఒవైసీ

Breaking News in Telugu Google news Google News in Telugu india Latest News in Telugu Pakistani nationals Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news visa services

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.