రష్యా చమురు కొంటున్నారన్న కారణంతో భారత్ పై సుంకాల మోత మోగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆ విషయంలో ఇప్పటికీ వెనక్కి తగ్గడం లేదు. అదే సమయంలో భారత్ తో చర్చల పేరిట టైంపాస్ చేస్తున్నారు. దీంతో భారత్ ((ndia)కు చిర్రెత్తుకొస్తోంది. ట్రంప్ ను ఇరుకునపెట్టేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా భారత్ ఇప్పుడు వదులుకోవడం లేదు. ఇదే క్రమంలో ఆప్ఘనిస్తాన్ లోని తాలిబాన్(Taliban) ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్న ట్రంప్ కు ఎదురువెళ్లాలని కీలక నిర్ణయం తీసుకుంది.
H-1B Visa: హెచ్ 1బీ హోల్డర్లు ఎక్కడకీ వెళ్ళకండి..

బగ్రామ్ ఎయిర్ బేస్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు
ఐరాస కీలక నిర్ణయం..! 20 ఏళ్ల పాటు ఆప్ఘనిస్తాన్ లోని బగ్రామ్ ఎయిర్ బేస్ నుంచి కార్యకలాపాలు సాగిస్తూ పశ్చిమాసియాలో పాగా వేసిన అమెరికా నాలుగేళ్ల క్రితం అక్కడ తమ చెప్పుచేతల్లోని ప్రభుత్వాన్ని తాలిబాన్లు కూల్చేయడంతో పునరాలోచనలో పడింది. బగ్రామ్ ఎయిర్ బేస్ తో పాటు అక్కడ ఉన్న విమానాల్ని కూడా వదిలేసి స్వదేశానికి వెళ్లిపోయింది. దీంతో బగ్రామ్ ఎయిర్ బేస్ తాలిబాన్ల నేతృత్వంలోని ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వం చేతికి వచ్చేసింది. కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకున్న అమెరికా దాన్ని కావాలంటోంది. ఆప్ఘనిస్తాన్ లోని తమ వ్యూహాత్మక స్ధావరమైన బగ్రామ్ ఎయిర్ బేస్ ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దాన్ని తమకు అప్పగించాలని కోరారు.
పశ్చిమాసియాలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న భారత్
గతంలో అమెరికా చెప్పుచేతల్లో అక్కడ ఉన్న ప్రభుత్వానికి ఇచ్చినట్లుగానే వారి స్ధానంలో అధికారం చేపట్టిన తాలిబన్లకు కూడా మద్దతిస్తోంది. ఈ మేరకు తాజాగా తాలిబాన్ మంత్రి భారత్ పర్యటనకు కూడా ఆహ్వానం పలికింది. ఈ మేరకు ఐరాసలో కూడా లైన్ క్లియర్ చేసింది. త్వరలో తాలిబాన్ విదేశాంగమంత్రి భారత్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో బగ్రామ్ ఎయిర్ బేస్ విషయంలో తాలిబన్లకు మద్దతివ్వాలని భారత్ నిర్ణయించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: