📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Latest News: Purandeswari: జాతి ప్రయోజనాలకే భారత్ మద్దతు.. ఐరాసలో పురందేశ్వరి

Author Icon By Anusha
Updated: October 30, 2025 • 10:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత ప్రతినిధిగా బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) దేశ తరఫున ప్రసంగించారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) వార్షిక నివేదికపై జరిగిన చర్చలో ఆమె జాతీయ ప్రకటన చేస్తూ, భారత్‌ అణు విజ్ఞానం, సాంకేతికతను శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించడంలో పూర్తి కట్టుబాటు కలిగిన దేశమని స్పష్టం చేశారు.

Read Also: Tamil Nadu: జాబ్ స్కామ్.. రంగంలోకి ఈడీ!

అణు విజ్ఞానం, సాంకేతికతను శాంతియుత ప్రయోజనాల కోసం సురక్షితంగా, భద్రంగా వినియోగించడంలో IAEA పోషిస్తున్న కీలక పాత్రకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు.

అణుశక్తి వల్ల బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయని పురందేశ్వరి (Purandeswari) అభిప్రాయపడ్డారు. కేవలం విద్యుత్ రంగంలోనే కాకుండా సుస్థిర అభివృద్ధి, ప్రజారోగ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ, వాతావరణ మార్పుల నియంత్రణ వంటి అనేక రంగాల్లో అణు సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు.

Purandeswari

‘CAR-T సెల్ థెరపీ’ ద్వారా

ఈ దిశగా భారతదేశం సాధించిన ప్రగతి అసాధారణమైనదని ఆమె పేర్కొన్నారు.ముఖ్యంగా, ప్రజారోగ్య రంగంలో సాధించిన విజయాన్ని పురందేశ్వరి ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశం దేశీయంగా అభివృద్ధి చేసిన ‘CAR-T సెల్ థెరపీ’ ద్వారా తక్కువ ఖర్చుతోనే క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణమని తెలిపారు.

ఇది అణు పరిజ్ఞానం మానవాళికి ఎంతగా ఉపయోగపడుతుందో చెప్పడానికి ఒక నిదర్శనమని అన్నారు.సామర్థ్య పెంపుదల, సాంకేతిక సహకారం వంటి కార్యక్రమాల ద్వారా భాగస్వామ్య దేశాలతో అణు పరిజ్ఞానాన్ని పంచుకుంటూ IAEAకు భారత్ నిరంతరం తోడ్పాటునందిస్తోందని పురందేశ్వరి వెల్లడించారు. శాంతియుత అణుశక్తి వినియోగంలో ప్రపంచ దేశాలకు అండగా నిలుస్తామని ఆమె పునరుద్ఘాటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

Breaking News Daggubati Purandeswari IAEA report India nuclear policy latest news Telugu News UN General Assembly

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.