📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

UN Chief: భారత్ సాయం తమకెంతో ముఖ్యం : చీఫ్ గుటెరెస్

Author Icon By Vanipushpa
Updated: February 17, 2026 • 1:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంతర్జాతీయ సమాజం అభ్యున్నతి కోసం శాశ్వత ప్రాతిపదికన భారత్ అందిస్తున్న సహాయం తమకెంతో ముఖ్యమైందని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ (Guterres) అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలక పాత్రను పోషించే అత్యంత సానుకూల ట్రెండ్ నడుస్తోందని ఆయన చెప్పారు. గ్లోబల్ సౌత్ దేశాల పరిధిలో తొలిసారిగా భారత్‌ నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ – 2026 సదస్సులో పాల్గొనేందుకు అమెరికాలోని న్యూయార్క్ నుంచి బయలుదేరే ముందు ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంటోనియో గుటెరెస్ ఈ కామెంట్స్ చేశారు.

Read Also: India AI Summit: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఇండియా కీలక ప్రకటన

UN Chief: భారత్ సాయం తమకెంతో ముఖ్యం : చీఫ్ గుటెరెస్

భారత్‌కు ఐరాస సదా రుణపడి వుంది

ప్రపంచ శాంతిభద్రతలు, వికాసం సహా అన్ని ఐక్యరాజ్యసమితి విభాగాల్లో భారత్ అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తోందని ఆంటోనియో గుటెరెస్ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఐరాస నిర్వహిస్తున్న పీస్ కీపింగ్ మిషన్లలో అత్యధికంగా 5వేల మంది భారత భద్రతాదళ సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఇందుకోసం భారత్‌కు ఐరాస సదా రుణపడి ఉంటుందన్నారు. 2007లో లైబీరియాలో పీస్ కీపింగ్ మిషన్ కోసం పూర్తిగా మహిళలతో కూడిన తొలి పోలీస్ యూనిట్‌ను అందించిన ఘనత భారత్‌కే దక్కుతుందని ఆయన చెప్పారు. జీ20 కూటమి సదస్సును భారత్ నిర్వహించిన టైంలోనే పలు విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్నారని ఆంటోనియో గుటెరెస్ గుర్తుచేశారు. భారత్ చొరవ వల్లే గ్లోబల్ సౌత్‌కు మేలు చేసే నిర్ణయాలను ఆ సదస్సులో తీసుకోవడం సాధ్యమైందన్నారు.

యావత్ ప్రపంచంలో సంక్షోభాలు, అన్యాయాలు, అసమానతలు వున్నాయి

‘ఇప్పుడు యావత్ ప్రపంచంలో సంక్షోభాలు, అన్యాయాలు, అసమానతలు, పేదరికం, ఆకలి పెరుగుతున్నాయి. ఇవి ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమస్యలకు మనం నేటికీ పరిష్కారాల్ని కనుగొనలేకపోయాం. మరోవైపు చాలా దేశాల్లో ఉగ్రవాద భూతం వేళ్లూనుకుంటోంది. దానివల్ల ఆయా దేశాలు అభివృద్ధిని సాధించలేకపోతున్నాయి. ఈనేపథ్యంలో యావత్ ప్రపంచం ఐక్యరాజ్యసమితి వైపు చూస్తోంది. నేను ఒక విషయాన్ని సూటిగా చెప్పదలిచాను. యూఎన్ అంటే కేవలం భద్రతామండలి కాదు. యూఎన్‌‌లో 193 దేశాలకు ప్రాతినిధ్యం ఉంది. ఈ అన్ని దేశాలకూ యూఎన్‌లో సమానమైన ప్రాధాన్యత ఉంటుంది.

భారత ద్రౌపది ముర్ము, నరేంద్రమోదీలతో భేటీ

భారత్‌లోని దిల్లీ వేదికగా ‘ఏఐ ఇంపాక్ట్ – 2026 సదస్సు’ ఫిబ్రవరి 16న మొదలైంది. ఇది ఫిబ్రవరి 20 వరకు కొనసాగుతుంది. ఈ సదస్సుకు ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరెస్ హాజరుకానున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీలతో భేటీ అవుతారు. సదస్సులో పాల్గొనే అంతర్జాతీయ స్థాయి టెక్ కంపెనీల ప్రముఖులతోనూ ఆంటోనియో సమావేశమవుతారు. ఐరాస ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ సైంటిఫిక్ ఫ్యానల్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ విభాగపు సభ్యులతో దిల్లీలో సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Antonio Guterres Diplomatic Relations Global Cooperation India global role India support India UN Relations International Support Telugu News Paper Telugu News Today UN Chief Statement united nations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.