📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Pahalgam Attack: కాల్పులకు పాల్పడ్డ పాక్..గట్టిగా బుద్ధి చెప్పిన భారత్

Author Icon By Vanipushpa
Updated: April 25, 2025 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడితో భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో దాయాది సైన్యం​ కవ్వింపు చర్యలకు దిగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరి జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి, పలు ప్రాంతాల్లో పాక్‌ సైన్యం కాల్పులకు తెగబడ్డాయి. ఈ దాడిని భారత్ ఆర్మీ దీటుగా బదులిచ్చినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. గురువారం అర్ధరాత్రి నుంచి ఈ కాల్పులు జరుగుతున్నట్లు పేర్కొన్నాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలు
మరోవైపు, జమ్ముకశ్మీర్‌లోని బందిపొరాలో ఎన్​కౌంటర్​ జరిగింది. శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ జిల్లాలోని కుల్నార్‌ బజిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడం వల్ల భద్రతా సిబ్బంది సెర్చ్​ ఆపరేషన్​ను చేపట్టారు. ఈక్రమంలో జవాన్లుపై ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులకు దిగారు. ప్రస్తుతం ఇక్కడ
నేడు జమ్ముకశ్మీర్‌ పర్యటనకు రానున్న భారత్​ ఆర్మీ చీఫ్‌
ఇదిలా ఉండగా, ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం శ్రీనగర్‌, ఉదమ్‌పూర్‌లో పర్యటించనున్నారు. కశ్మీర్‌ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ప్రస్తుతం నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పరిస్థితులపై సమీక్షించనున్నారు. సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ, పహల్గాం దాడి నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. పహల్గాంలో ఏప్రిల్‌ 22న పర్యటకులపై జరిపిన ఉగ్రవాదులు దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్‌తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది.

Read Also: Pope: పోప్ రేసులో వున్నవారు ఎవరు..ఇందుకు కావాల్సిన అర్హతలు ఏమిటి?

Breaking News in Telugu Google News in Telugu India strongly warns Latest News in Telugu Pakistan over firing Paper Telugu News Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.