📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Modi: రక్షణ రంగాన్ని మరింత బలోపేతం దిశగా భారత్ అడుగులు

Author Icon By Vanipushpa
Updated: July 15, 2025 • 4:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దాయాది దేశంతో పాకిస్తాన్(Pakistan) తో ఆపరేషన్ సింధూర్ సక్సెస్(Operation Sindoor Success) తర్వాత భారత్(India) తన రక్షణ(Defence) రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశ సముద్ర రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఒక కీలకమైన ముందడుగు పడింది. ఇందులో భాగంగానే మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ రూ. 5 వేల కోట్ల పెట్టుబడి ద్వారా నౌకా నిర్మాణ సామర్థ్యం పెంచుతోంది. మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) రూ.4,000 నుండి రూ.5,000 కోట్ల పెట్టుబడితో తన నౌకదళాన్ని దుర్భేధ్యమైన శత్రు వ్యవస్థగా తీర్చి దిద్దుతోంది.
ఈ మధ్య పాకిస్తాన్ తో జరిగిన ఉద్రిక్త పరిణామాల మధ్య అరేబియన్ సముద్రంలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత తీసుకున్న కీలక నిర్ణయమని చెప్పుకోవచ్చు.

Modi: రక్షణ రంగాన్ని మరింత బలోపేతం దిశగా భారత్ అడుగులు

రెండు కొత్త బేసిన్లు ఏర్పాటు

ఈ ఆపరేషన్‌లో భారత నౌకాదళం చూపిన తెగువకు సముద్రశక్తిని మరింతగా పెంచాలన్న దిశగా ప్రణాళికలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుత ముంబై క్యాంపస్‌ సమీపంలోని 10 ఎకరాల సముద్ర ప్రదేశాన్ని తిరిగి పొందిన MDL, అక్కడ రెండు కొత్త బేసిన్లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా పెద్ద నౌకలు, సబ్‌మేరిన్లను ఒకేసారి నిర్మించడమే కాకుండా మరమ్మతులు కూడా చేయగల సామర్థ్యం కూడా ఏర్పడుతుంది.

MDL ఒకేసారి 11 సబ్‌మేరిన్లు,10 వార్‌షిప్స్

ఈ తాజా విస్తరణతో MDL యొక్క డెడ్‌వెయిట్ హ్యాండ్లింగ్ సామర్థ్యం 40 వేల టన్నుల నుంచి 80 వేల టన్నులకు కానుంది. అంటే రెండింతలు పెరుగుదల కానుంది. దీంతో పాటుగా నవా శేవా పోర్ట్‌లో ఇప్పటికే 37 ఎకరాలు పొలాలను సేకరించిన MDL.. భవిష్యత్తులో 2 లక్షల డెడ్‌వెయిట్ టన్నుల సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. డెడ్‌వెయిట్ టన్నులు (DWT) అనేది ఒక ఓడ మోయగల గరిష్ట బరువును సూచిస్తుంది. ఇది ఓడలో ఉన్న కార్గో, ఇంధనం, నీరు, సిబ్బంది, సామాగ్రి మొదలైన వాటి బరువును కలిగి ఉంటుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళాన్ని చైనా కలిగి ఉంది

ప్రస్తుతం భారత నౌకాదళానికి ఈ సంస్థ రూ.1.06 లక్షల కోట్ల విలువైన రెండు మెజర్ సబ్‌మెరైన్ ప్రాజెక్టులపై పని చేస్తోంది. ఇవి భారత్ యొక్క అండర్‌సీ వార్‌ఫేర్ సామర్థ్యాలను కొత్త స్థాయికి తీసుకెళ్లనున్నాయి. భారత్‌లో నౌకా నిర్మాణం వేగంగా పెరుగుతున్నప్పటికీ పొరుగుదేశం చైనా కన్నా తక్కువగానే ఉంది. 370కి పైగా నౌకలతో ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళాన్నిచైనా కలిగి ఉంది. అయితే స్వదేశీ మౌలిక సదుపాయాల పెంపు ద్వారా ఈ గ్యాప్‌ను తగ్గించేందుకు భారత్ కృషి చేస్తోంది .

ఆపరేషన్ సిందూర్ వెనుక కథ ఏమిటి?
సైనిక సిబ్బందితో పాటు నిరాయుధ పౌరులను కూడా లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న అసమాన యుద్ధానికి క్రమాంకనం చేసిన సైనిక ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్ ఉద్భవించింది.
భారత నావికాదళంలో ఆపరేషన్ సిందూర్ అంటే ఏమిటి?
నియంత్రణ రేఖ వెంబడి మరియు పాకిస్తాన్ లోపలి భాగంలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేసేందుకు శిక్షాత్మక మరియు లక్ష్యంగా చేసుకున్న ప్రచారంగా ఆపరేషన్ సిందూర్‌ను రూపొందించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Shubhanshu Shukla : అంతరిక్షం నుంచి ల్యాండ్ అయిన శుభాంశు శుక్లా!

#telugu News defence modernization India defence sector indigenous defence production Make in India military strength National Security

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.