📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India-Russia : రష్యాతో భారత్ సంబంధాలపై ట్రంప్ ఆగ్రహం

Author Icon By Anusha
Updated: July 31, 2025 • 5:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారత్-రష్యాల మధ్య వాణిజ్య బంధాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికే భారతీయ దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో, రష్యాతో ఉన్న భారత్‌ సంబంధాలపై ఆయన తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సుంకాల నిర్ణయానికి రష్యా (Russia) ప్రధాన కారణమని, భారత్ రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేయడం వలన అమెరికా ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు.

సోషల్ మీడియా వేదికగా ట్రంప్ కామెంట్లు

ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో పోస్ట్ చేస్తూ, రష్యాతో భారత్ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంపై తాను వ్యక్తిగతంగా అభ్యంతరం పెట్టడం లేదని కానీ, అది భారత్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. తాము న్యూఢిల్లీతో తక్కువ స్థాయిలో మాత్రమే వ్యాపారం చేస్తున్నప్పటికీ, వాషింగ్టన్-న్యూఢిల్లీ (Washington-New Delhi) మధ్య వాణిజ్య లోటు చాలా ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.“ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ కూడా ఒకటి. అమెరికా తన వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరిగా ఈ సుంకాలు విధించాల్సి వచ్చింది” అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

రష్యా చమురు దిగుమతులే కారణమా?

రష్యా నుంచి దిగుమతుల కారణంగా యూఎస్ పెనాల్టీలకు గురైన మొదటి దేశం భారతే కాగా, న్యూఢిల్లీతో అమెరికా చాలా తక్కువ వ్యాపారం చేస్తోందని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే భారత్ తమకు మిత్ర దేశమే అయినప్పటికీ.. తమపై భారత్ చాలా పెద్ద ఎత్తున సుంకాలు విధించిందని పునరుద్ఘాటించారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు తమపై విధించే సుంకాల కంటే ఇవి చాలా ఎక్కువని చెప్పారు. అందుకే తాము చాలా ఏళ్లుగా ఇండియాతో తక్కువ వ్యాపారం చేస్తున్నట్లు వెల్లడించారు.అలాగే తాము వాషింగ్టన్‌తో ఎలాంటి వ్యాపారం చేయడం లేదని తేల్చి చెప్పారు. అంతటితో ఆగకుండా ఆ రష్యా మాజీ అధ్యక్షుడు దమిత్రి మద్వెదేవ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత్ రష్యాకు మద్దతు ఇస్తుందా?

అవును, భారత్ రష్యాతో దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది. ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని (Strategic Partnership) కలిగి ఉన్నాయి.

భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం అంటే ఏమిటి?

ఇది ఇరు దేశాలు పరస్పరం రక్షణ, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో సహకరించే బలమైన ఒప్పందం. అంతర్జాతీయ వేదికలపై కూడా ఒకరినొకరు మద్దతు ఇస్తారు.

Read hindi news : hindi.vaartha.com

Read Also:  United Nations: భారతీయులే ప్రపంచంలో అత్యధిక వలసదారులు

25% tariffs on India Breaking News Donald Trump news India Russia oil deals latest news Telugu News US India trade relations US trade deficit with India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.