Vladimir Putin Life Style: భారత(India) పర్యటనకు సిద్ధమవుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగత జీవితం, సంపద, విలాసవంతమైన ఆస్తులు ఎప్పటికప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ప్రపంచంలో అత్యంత ధనిక రాజకీయ నేతల్లో ఒకరిగా పుతిన్‌ను పలువురు అంతర్జాతీయ మీడియా సంస్థలు అభివర్ణిస్తున్నాయి.
అధికారికంగా క్రెమ్లిన్ విడుదల చేసిన పత్రాల ప్రకారం పుతిన్ వార్షిక ఆదాయం సుమారు 1.20 కోట్లు (That is 140,000 dollars.) మాత్రమేనని పేర్కొనబడింది. అయితే ఆయన జీవించే విధానం, ఉపయోగించే లగ్జరీ సౌకర్యాలు ఈ సంఖ్యను సందేహాస్పదంగా మారుస్తున్నాయి.
Read also: Israel: అరెస్టుకు భయపడను.. న్యూయార్క్ పర్యటనపై నెతన్యాహు
పుతిన్ ప్రకటించిన ఆస్తులు
ఫార్చ్యూన్ వంటి పలు మీడియా నివేదికల ప్రకారం పుతిన్ అధికారిక డాక్యుమెంట్లలో కేవలం 800 చదరపు అడుగుల ఫ్లాట్ మరియు మూడు కార్లు మాత్రమే నమోదు చేసినా, ఆయన అసలు ఆస్తులు అంచనా వేచలేనంత విస్తృతంగా ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ధరించే లగ్జరీ గడియారాల విలువే ఆయన వార్షిక జీతాన్ని సులభంగా మించేస్తుందని చెబుతారు.
లగ్జరీ వాచ్‌ల విలువే వార్షిక జీతాన్ని మించే స్థాయిలో
పుతిన్ సొంతం అని చెప్పబడే పటెక్ ఫిలిప్ పెర్పెచువల్ క్యాలెండర్ వాచ్ ధర సుమారు 60,000 డాలర్లు కాగా, A. లాంగే & సోహ్నే టౌబోగ్రాఫ్ గడియారం ధర 500,000 డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. ఇవి ఆయన విలాసవంతమైన జీవనశైలిలోని చిన్న ఉదాహరణలేనని నిపుణులు చెబుతున్నారు.
పుతిన్‌కు సంబంధించి అత్యంత చర్చనీయాంశమైన ఆస్తుల్లో ఒకటి నల్ల సముద్రం సమీపంలోని కొండ తొర్రపై నిర్మించిన భారీ ప్రైవేట్ ప్యాలెస్. సుమారు 190,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ అద్భుత నిర్మాణం “పుతిన్స్ కంట్రీ కాటేజ్(Putin’s Country Cottage)”గా కూడా పేరుపొందింది. రష్యాలోని ప్రైవేట్ ప్రాపర్టీలలో ఇది అతి పెద్దదని అంటారు.
రష్యా అధ్యక్షుడి సంపదపై అంతర్జాతీయ మీడియా అనుమానాలు
ఈ ప్రాసాదంలో ఫ్రెస్కోలతో అలంకరించిన పైకప్పులు, శిల్పకళతో రూపుదిద్దిన మార్చురంగాలు, పాలరాయి స్విమ్మింగ్ పూల్, 27,000 చదరపు అడుగుల అతిథి గృహం, హమామ్‌లతో కూడిన స్పా విభాగాలు, ప్రత్యేకమైన మ్యూజిక్ హాల్, ఐస్ హాకీ రింక్, క్యాసినో, స్టేజ్ & డ్యాన్స్ పోల్‌తో నైట్‌క్లబ్, కోట్ల విలువైన వైన్స్‌ను భద్రపరిచే భూగర్భ గిడ్డంగి వంటి ఎన్నో విలాస సౌకర్యాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: