📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: India: రేపు భారత్ కు రానున్న పుతిన్.. భారీ భద్రతా ఏర్పాట్లు

Author Icon By Sushmitha
Updated: December 3, 2025 • 5:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రేపు ఎల్లుండి రెండురోజుల పర్యటన నిమిత్తం భారత్ కు (India) రానున్నారు. రేపు సాయంత్రం పుతిన్ భారత్ కు చేరుకోనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నేషనల్ సెక్యురిటీ గార్డ్ నుంచి అగ్రశ్రేణి కమాండోలు, స్నైపర్స్, డ్రోన్లు, జామార్లు, ఏఐ, ఇలా 5 అంచెల భద్రతా వలయాన్ని సిద్ధం చేశారు.

Read Also: Pakistan: తనను మానసికంగా హింసిస్తున్నారు..ఇమ్రాన్‌ఖాన్ సోదరి

India Putin to arrive in India tomorrow.. Heavy security arrangements

వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్న పుతిన్ ప్రధాని మోడీ (Modi) ఆహ్వానం మేరకు భారతదేశం-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి భారతదేశాన్ని సందర్శిస్తున్న పుతిన్ రేపు సాయంత్రం ఢిల్లీలో దిగనున్నారు. ప్రధాని మోడీతో కలిసి పుతిన్ డిన్నర్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరుసటి రోజు రాష్ట్రపతి భవన్ లో ఆయనకు లాంఛనప్రాయ స్వాగతం పలుకుతారు. శుక్రవారం, ఆయన రాజ్ ఘాట్ లో మహాత్మాగాంధీ స్మారక చిహ్నాన్ని సందర్శించనున్నారు. దీని తర్వాత, హైదరాబాద్ హౌస్ లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి, ఆ తర్వాత భారత మండపంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) నిర్వహించే విందులో కూడా ఆయన పాల్గొంటారు.

కట్టుదిట్టమైన భద్రత

పుతిన్ భద్రత కోసం ఢిల్లీ పోలీసులు, ఎన్ ఎస్ జీ భద్రతా అధికారులు పుతిన్ ప్రయాణించే మార్గాలను ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నారు. అనేకమంది స్నైపర్లు పుతిన్ కదలిక మార్గాన్నిఎప్పటికప్పుడు కవర్ చేస్తారు. ఏఐ పర్యవేక్షణ, ఫేస్ రికగ్నైజేషన్ వంటి కెమెరాలను పుతిన్ భద్రత కోసం ఉపయోగిస్తున్నారు. పుతిన్ ల్యాండ్ అయిన మరుక్షణం నుంచి ఆయనకు 5 లేయర్డ్ సెక్యూరిటీ పూర్తిస్థాయిలో యాక్టివ్ అవుతుంది. భారత స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోలు అంతర్గత భద్రతా వలయాన్ని పర్యవేక్షిస్తారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

BilateralTalks Google News in Telugu HighSecurity india IndiaRussiaSummit Latest News in Telugu NewDelhi PutinVisit SecurityArrangements Telugu News Today TomorrowVisit VladimirPutin

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.