📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

India Pakistan War: భారత్-పాకిస్తాన్ యుద్ధం..తామేమీ చేయలేమన్న జేడీ వాన్స్

Author Icon By Shobha Rani
Updated: May 9, 2025 • 12:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్‌పై దండెత్తింది భారత్. జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ పొడవునా డ్రోన్లు, మిస్సైళ్లతో పాకిస్తాన్ సాగించిన దాడికి ప్రతీకారంగా యుద్ధానికి దిగింది. రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, సియాల్‌కోట్ వంటి నగరాలపై విరుచుకుపడుతోంది. రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడిపారక్కడి జనం. భీకరంగా సాగుతున్న ఈ యుద్ధంపై జోక్యం చేసుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా నిరాకరించింది. యుద్ధం ఆరంభమైనప్పుడు తామేమీ చేయలేమని తేల్చి చెప్పింది. వార్ మొదలు కావడానికి ముందే భారత్- పాకిస్తాన్ (india,pak war) మధ్య ఉద్రిక్తతలను నివారించడానికి చేయాల్సిందంతగా చేశామని పేర్కొంది. ఇందులో పాల్గొనడానికీ అయిష్టత చూపింది. యుద్ధం మొదలైన తరవాత అమెరికా స్పష్టమైన ప్రకటన చేసింది. ఇది తమ సమస్య కాదని, ఇందులో తామేమీ చేయలేమని పేర్కొంది. భారత్, పాకిస్తాన్ (india,pak war) మధ్య ఉద్రిక్తతలను నివారించేందుకు యుద్ధం ప్రారంభానికి ముందు తాము కావలసినంత చేశామని తెలిపింది.

జేడీ వాన్స్ స్పష్టీకరణ
యుద్ధం మధ్యలో జోక్యం చేసుకోవడం ఎంతమాత్రం సహేతుకం కాదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. అది యుద్దనీతి అనిపించుకోదనీ తేల్చి చెప్పారు. ఇందులో తాము పాల్గొనదలచుకోలేదనీ అన్నారు. యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని సలహా మాత్రమే ఇవ్వగలమని అన్నారు. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆరంభమైన తరువాత ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ మాట్లాడారు. ఈ తమకు సంబంధించినది కాదని (None of our business) కాదని, దాన్ని నియంత్రించాలనుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు.

India Pakistan War: భారత్-పాకిస్తాన్ యుద్ధం: తాజా పరిణామాలు

అస్త్రసన్యాసం చేయమని తామెలా భారత్‌కు గానీ, పాకిస్తాన్‌కు గానీ చెప్పగలమని అన్నారు. అలా ఎప్పుడూ చెప్పలేదని గుర్తు చేశారు. దౌత్య మార్గాల ద్వారానే ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నివారించడానికి ప్రయత్నం చేస్తామని జేడీ వాన్స్ (Jd vance) స్పష్టం చేశారు. ఈ యుద్ధం- ఈ రెండు దేశాలకే పరిమితం కావాలని, మరింత విస్తరించకూడదని అమెరికా కోరుకుంటోందని అన్నారు. బారత ఉపఖండం లేదా ఆసియా- పసిఫిక్ రీజియన్, అణ్వస్త్ర యుద్ధంగా మారబోదని ఆశిస్తున్నట్లు చెప్పారు.
అణు యుద్ధ భయం
దీనిపైనే తాము ఎక్కువగా ఆందోళన చెందుతున్నామని, అలా జరగకూడదని జేడీ వాన్స్ అన్నారు. ఆ స్థాయి తీవ్రత ఉండదని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఆయన వివరించారు. భారత్- పాకిస్తాన్‌ల (india,pak war) వద్ద ఉన్న కూలర్ హెడ్‌ల పని.. ఇది- అణు యుద్ధంగా మారకుండా చూసుకోవడం అని వ్యాఖ్యానించారు. అది జరిగితే, అది వినాశనానికి దారి తీస్తుందని చెప్పారు.

Read Also: Pakistan: భారత్ దెబ్బ : ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ సైరన్లతో పౌరులు భయబ్రాంతులు

Breaking News in Telugu Google news Google News in Telugu India-Pakistan War: Latest Developments Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.