📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India-pak : భారత్-పాకిస్తాన్ చర్చలు చివరి నిమిషంలో వాయిదా

Author Icon By Shobha Rani
Updated: May 12, 2025 • 4:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ – పాక్ (India-pak) చర్చల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డీజీ ల మధ్య హాట్ లైన్ లో చర్చలు జరగాల్సి ఉంది. మధ్నాహ్నం 12 గంటలకు ఇందుకు ముహూర్తంగా ఖరారు చేసారు. ఇదే సమయంలో ప్రధాన మోదీ ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసారు. చర్చల వేళ తన వైఖరిని తేల్చి చెప్పారు. భారత్ డిమాండ్ల పైన పాక్ స్పందనకు అనుగుణంగానే నడుచుకోవాలని త్రివిధ దళాలకు ప్రధాని స్పష్టం చేసారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో, చర్చల వేళ తదుపరి పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

India-pak : భారత్-పాకిస్తాన్ చర్చలు చివరి నిమిషంలో వాయిదా


మోదీ సమీక్షతో ఒత్తిడికి నూతన రూపం
ఇండో, పాక్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ సమావేశం వాయిదా పడింది. ఈ మధ్నాహ్నం 12 గంటలకే జరగాల్సిన భేటీ అనూహ్యంగా వాయిదా వేసారు. ఆ సమయంలోనే ప్రధాని మోదీ కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఈ భేటీ అనంతరం జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో మోదీ (modi) ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్‌, పాక్‌ (India-pak) చర్చల నేపథ్యంలో వివిధ అంశాల పై వీరు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈరోజు రక్షణ ఉన్నతాధికారులతో ప్రధాని నిర్వహించిన రెండో కీలక భేటీ ఇది. ఇలా వరుస భేటీలతో పాక్ పైన ఒత్తిడి పెంచే వ్యూహాలకు మోదీ (modi) పదును పెడుతున్నారు. భారత్ డిమాండ్ల పైన పాక్ స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. పాక్ ను పూర్తిగా ఫిక్స్ చేసే లక్ష్యంతోనే చర్చలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డీజీ ల మధ్య హాట్ లైన్ లో చర్చలు జరుగుతున్నాయి.
48 గంటల కాల్పుల విరమణపై చర్చలు
48 గంటల పాటు కాల్పుల విరమణ, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. కాగా, ఈ చర్చల సమయంలో భారత్ తమ డిమాండ్స్ ఏంటనేది తేల్చి చెప్పింది. కాల్పుల విరమణ కోసం భారత్ ప్రధానితో అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ మాట్లాడిన సమయంలోనే కొన్ని అంశాల పైన స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా పాక్ లో ఉన్న మసూద్ అజార్ తో పాటుగా టాప్ ఉగ్రవాదులను అప్పగించాలనేది ప్రధాన డిమాండ్ గా ఉంది. అదే సమయంలో పీఓకే ను పాక్ ఖాళీ చేయాల్సిందేనని మోదీ తేల్చి చెప్పినట్లు సమాచారం.

Read Also: BLA Warns: పాక్‌తో జాగ్రత్తగా ఉండాలని బలోచ్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరిక

Breaking News in Telugu Google news India-Pakistan Latest News in Telugu Paper Telugu News talks postponed at last minute Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.