📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Donald Trump :“భారత్, పాక్ వార్ నేనే ఆపించాను”..ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

Author Icon By Shobha Rani
Updated: May 16, 2025 • 4:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌, పాకిస్థాన్‌ (India-Pak) నేను చెబితేనే యుద్ధం ఆపేశాయంటూ క్రెడిట్‌ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఆపసోపాలు పడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ అంశంపై స్పందించిన ట్రంప్‌ తాజాగా మరోసారి భారత్‌, పాక్‌ కాల్పుల విరమణపై మాట్లాడారు. ఖతార్‌లోని ఒక స్థావరంలో ఉన్న అమెరికన్ సైనికులతో ట్రంప్ మాట్లాడుతూ.. “గత వారం భారత్‌, పాకిస్తాన్ (India-Pak) మధ్య సమస్యను పరిష్కరించడానికి తాను కచ్చితంగా సహాయం చేశానని, మరింత ఎక్కువయ్యే ప్రతికూల పరిస్థితిని తాను పరిష్కరించాను. అయితే మొత్తం నేనే చేశానని చెప్పదలచుకోలేదు… కానీ గత వారం భారత్‌, పాకిస్తాన్ మధ్య సమస్యను పరిష్కరించడానికి నేను కచ్చితంగా సహాయం చేశాను, ఇది మరింత శత్రుత్వంగా మారుతుండగా, అకస్మాత్తుగా మీరు వేరే రకం క్షిపణులను చూడాల్సి వచ్చేది, కానీ, మేం దాన్ని పరిష్కరించాం” అని ట్రంప్ (Donald Trump) అన్నారు. భారత్ – పాకిస్థాన్ (India-Pak) మధ్య నెలకొన్న ఉద్రిక్తతను నేను స్వయంగా పరిష్కరించాను. అది పెద్ద యుద్ధంగా మారబోతుండగా, నేను జోక్యం చేసుకొని పరిష్కరించాను.” అయితే ట్రంప్ తన చరిత్రాపూర్వక వ్యాఖ్యలో, “నేనే అన్నిటిని చేశాను అనటం లేదు… కానీ నేను స్పష్టంగా కల్పించిన సహాయం వల్లే కాల్పుల విరమణ సాధ్యమైంది” అన్నారు.

Donald Trump :“భారత్, పాక్ వార్ నేనే ఆపించాను”..ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

యుద్ధ భయాన్ని నివారించాను
అమెరికా రెండు దేశాలతో వాణిజ్యాన్ని పెంచే అవకాశం ఉండటం వల్ల కాల్పుల విరమణ సులభతరం అయిందని కూడా ఆయన పేర్కొన్నారు. వారితో వాణిజ్యం గురించి మాట్లాడాం, యుద్ధానికి బదులుగా వాణిజ్యం చేద్దాం అని నేను ఇరు దేశాలతో చెప్పాను, దాంతో ఇరు దేశాలు సంతోషంగా కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని ట్రంప్‌ వెల్లడించారు. అప్పటి కాల్పుల విరమణ (Ceasefire) భారత్ – పాక్ మధ్య కీలక ఆమోదం తర్వాత ఏర్పడింది. అయితే, అమెరికా ద్వారా మౌన మద్దతు, చర్చలు జరిగాయని అప్పటి విశ్లేషణలు ఉన్నాయి. కానీ ట్రంప్ “నాకు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు” అనే ధోరణి కొంత అతిశయోక్తిగా ఉందని నిపుణుల అభిప్రాయంభారత్‌, పాక్‌ దాదాపు వెయ్యి సంవత్సరాలుగా పోరాడుతున్నాయి. ఈ సమస్యను తాను పరిష్కగలనని నమ్మానని, అలాగే పరిష్కరించానంటూ పేర్కొన్నారు.

Read Also: Operation sindoor: భారత్‌కు ఆపరేషన్‌ సిందూర్‌తో వేల కోట్ల లాభం! ఎలాగంటే..?

#telugu News india pak war Today news Trump's key comments

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.