📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Non-Veg Milk: అమెరికా మాంసాహార పాలను భారత్ ఎందుకు వ్యతిరేకిస్తోంది?

Author Icon By Vanipushpa
Updated: July 17, 2025 • 1:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-అమెరికా(India-America) మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలు నాన్ వెజ్ పాల(Non-Veg Milk)కు సంబంధించిన వివాదంతో నిలిచిపోయాయి. భారతదేశ సంస్కృతి సంప్రదాయాల మీద అమెరికా చేయాలనుకుంటున్న మాంసాహార పాల దాడిని మోదీ సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పాలపై తమకు కొన్ని సాంస్కృతిక ఆందోళనలు ఉన్నాయని భారతదేశం వాదిస్తోంది. కాబట్టి అమెరికా(America) డిమాండ్‌ను అంగీకరించలేమని ఖరాఖండిగా తేల్చి చెప్పింది. ఇక అమెరికా దీనిపై మొండి పట్టుబడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద పాలు ఉత్పత్తిదారుగా ఇండియా(India) ఉన్న నేపథ్యంలో వ్యవసాయం, పాల రంగంలో అమెరికా భారతదేశంలో ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తోంది. భారతదేశంలో వ్యవసాయం, పాల ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో అమెరికా తన ఉత్పత్తులను ఇండియాలో దింపి దేశ ఆర్థిక వ్యవస్థను శాసించాలని ప్రయత్నాలు చేస్తోంది.

Non-Veg Milk: అమెరికా మాంసాహార పాలను భారత్ ఎందుకు వ్యతిరేకిస్తోంది?

సాంస్కృతిక ఆందోళనల కారణంగా..
దీనికి భారత్ గట్టిగానే బదులిస్తోంది. రైతులు నష్టపోతారంటూ భారత్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో నెలకొన్న సాంస్కృతిక ఆందోళనల కారణంగా అమెరికా డిమాండ్‌ను అంగీకరించబోమని మోదీ సర్కారు స్పష్టంగా తేల్చి చెప్పింది.అమెరికా పాల ఉత్పత్తులు భారతదేశ సంస్కృతిని ప్రభావితం చేయకూడదని కోరుకుంటుంది.
నాన్ వెజ్ మిల్క్ అంటే ఏమిటి?
యుఎస్ నుండి దిగుమతి చేసుకునే పాల ఉత్పత్తులకు కఠినమైన సర్టిఫికేషన్ నిబంధనలు విధించాలని భారత్ ప్రభుత్వం కోరుతోంది. ఆ నిబంధనలో ప్రధాన షరతు ఏమిటంటే ఆ పాలు ఇచ్చిన ఆవులకు ఎప్పుడూ మాంసం, రక్తం లేదా జంతు భాగాలపై ఆధారపడిన ఆహారం ఇవ్వకూడదు. కాగా అమెరికాలో ఆవులకు మాంసం కలిగిన ఆహారాన్ని తినిపిస్తారు.అమెరికాలో ఆవులకు పందులు, చేపలు, కోళ్లు, గుర్రాలు, పిల్లి లేదా కుక్క భాగాలను కూడా ఆవులకు తినిపిస్తున్నారు. కొవ్వు పెరగడానికి ప్రోటీన్, కొవ్వు కోసం వాటికి జంతువుల రక్తం కూడా ఇవ్వబడుతుందని తెలుస్తోంది. దీని అర్థం ఆవులకు ఇచ్చే ఆహారంలో తరచుగా జంతువుల అవశేషాలు ఉంటాయి.
పూజా కార్యక్రమాల్లో పాలు, నెయ్యి ముఖ్యమైన పాత్ర
భారతదేశం ఎందుకు దీనిని వ్యతిరేకిస్తోంది: ప్రపంచంలోనే అతిపెద్ద పాలు ఉత్పత్తిదారుగా ఇండియా ఉంది. భారతదేశంలో దాదాపు 38 శాతం మంది ప్రజలు శాకాహారులు. హిందూ మతంలో పాలు, నెయ్యి వంటి ఉత్పత్తులు పూజా కార్యక్రమాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒక ఆవుకు మాంసం లేదా రక్తం కలిసిన ఆహారం ఇచ్చి ఆ పాలు పూజకు ఉపయోగిస్తే దానిని పవిత్రంగా భావించరు. అందుకే మోదీ సర్కారు దీనిని “నాన్ వెజ్ పాలు”గా పరిగణించి వ్యతిరేకిస్తోంది. 2023-24లో 239.30 మిలియన్ టన్నుల పాలు ఉత్పత్తి అయ్యాయి.

మతపరమైన భావాలను దృష్టిలో ఉంచుకుని..

దేశంలో కర్షకుల ఆదాయానికి ఇదే ప్రధాన వనరు. భారతదేశంలో ఆవులకు ప్రధానంగా శాఖాహార ఆహారం ఇస్తారు. ఆవులు పొడి గడ్డి, పచ్చి మేత, మొక్కజొన్న, గోధుమ ధాన్యాలు తింటాయి. దీనితో పాటు వాటికి ఊకను తినిపిస్తారు. కొన్ని పెద్ద పాడి పరిశ్రమలు మతపరమైన భావాలను దృష్టిలో ఉంచుకుని విదేశీ పద్ధతులను అవలంబించడం ప్రారంభించినప్పటికీ దేశంలో మాంసాహార ఆహారం ఇప్పటికీ ఆమోదయోగ్యం కాదనే చెప్పుకోవాలి .

భారతదేశం అమెరికా నుండి పాలను దిగుమతి చేసుకుంటుందా?

2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $500 బిలియన్లకు పెంచాలని భారతదేశం మరియు అమెరికా లక్ష్యంగా పెట్టుకున్నాయి, కానీ పాల దిగుమతులపై చర్చలు నిలిచిపోయాయి. సాంస్కృతిక ఆందోళనలను చూపుతూ భారతదేశం అమెరికన్ పాల ఉత్పత్తులను నిరాకరిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: drunk and drive : హైదరాబాద్‌లో పగటి వేళల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

#telugu News Dairy Trade Dispute Food Safety FSSAI Standards Hormone-treated Milk India vs US Trade Indian Culture Latest News Breaking News Non-Vegetarian Milk US Milk Export WTO Milk Issue

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.