Trade Deal: చమురు దిగుమతులకు వెనిజులా వైపుకు భారత్ అడుగులు

Read Time:  1 min
చమురు దిగుమతులకు వెనిజులా వైపుకు భారత్ అడుగులు
చమురు దిగుమతులకు వెనిజులా వైపుకు భారత్ అడుగులు
FONT SIZE
GET APP

అమెరికా-భారత్(America) మధ్య వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపుగా మారే దిశగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెండు దేశాలు శుక్రవారం ఒక మధ్యంతర వాణిజ్య ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించాయి. ఈ ఒప్పందం సుంకాల తగ్గింపు, ఇంధన భాగస్వామ్యాల పునర్వ్యవస్థీకరణ, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా రూపొందించారు. దీని ద్వారా భవిష్యత్తులో కుదిరే విస్తృత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) వైపు చర్చలను వేగవంతం చేయాలని రెండు దేశాలు సంకల్పించినట్టు ఉమ్మడి ప్రకటనలో వెల్లడించాయి. అయితే, పూర్తి స్థాయి ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఇంకా అనేక దశల చర్చలు అవసరమని కూడా స్పష్టం చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకారం.. భారతదేశం రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేయడం, వాణిజ్య అడ్డంకులను సడలించడంపై అంగీకరించిన నేపథ్యంలో భారత వస్తువులపై అమెరికా విధించిన సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించేందుకు వాషింగ్టన్ అంగీకరించింది.


Read Also: Fire Accident: ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం? 

Trade Deal: చమురు దిగుమతులకు వెనిజులా వైపుకు భారత్ అడుగులు
Trade Deal: చమురు దిగుమతులకు వెనిజులా వైపుకు భారత్ అడుగులు

అమెరికా–భారత్ ట్రేడ్ డీల్

ఈ నిర్ణయం భారత ఎగుమతులకు గణనీయమైన ఊరటగా భావిస్తున్నారు. గతంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగా భారత్‌పై 50 శాతం సుంకాన్ని విధించినట్టు ట్రంప్ గుర్తు చేశారు. ఇది ఉక్రెయిన్ యుద్ధంలో మాస్కోకు భారత్ మద్దతిస్తున్నట్టు భావించి తీసుకున్న చర్యగా ఆయన వివరించారు. అయితే ఈ వారం భారత్ తన చమురు దిగుమతులను అమెరికా, వెనిజులా వంటి దేశాలకు మళ్లించేందుకు అంగీకరించడంతో..ఆ 50 శాతం సుంకంలో మిగిలిన 25 శాతాన్ని కూడా ఉపసంహరించుకుంటూ ట్రంప్ శుక్రవారం ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ట్రంప్ సోమవారం వెల్లడించిన వాణిజ్య ఒప్పందం యొక్క ప్రాథమిక రూపురేఖలతో పోలిస్తే.. శుక్రవారం విడుదలైన ఉమ్మడి ప్రకటన మరింత స్పష్టమైన వివరాలను అందించింది.

భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో..

ఈ జాబితాలో ముడి చమురు, సహజ వాయువు, కోకింగ్ బొగ్గు, విమానాలు, విమాన భాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు ఉన్నాయి. ఇది ఇప్పటివరకు భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో అతిపెద్ద కొనుగోలు ప్రతిజ్ఞగా భావిస్తున్నారు. అమెరికా–భారత్ ట్రేడ్ డీల్.. భారత ఫార్మా రంగానికి టారిఫ్ షీల్డ్ పొడిగింపు.. టెక్నాలజీ విభాగంలో కృత్రిమ మేధస్సు (AI) రంగంలో విస్తృతంగా ఉపయోగించే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (GPUs), డేటా సెంటర్ల కోసం అవసరమైన అధునాతన పరికరాలు కూడా ఈ కొనుగోళ్లలో భాగంగా ఉండనున్నాయి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, డేటా ఆధారిత సేవలు, ఆరోగ్య సాంకేతికత వంటి రంగాల్లో ఇది భారత్‌కు కీలకంగా మారనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.