📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

India AI Summit: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఇండియా కీలక ప్రకటన

Author Icon By Vanipushpa
Updated: February 17, 2026 • 11:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశంలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 దేశానికి మాత్రమే కాకుండా.. ప్రపంచ కృత్రిమ మేధస్సు (AI) భవిష్యత్తుకు కూడా కీలక మలుపుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సదస్సు నుంచి ఢిల్లీ Declaration అనే పేరుతో ఒక ముఖ్యమైన అంతర్జాతీయ ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రకటనలో ప్రధానంగా AI సాంకేతికతను మరింత ప్రజాస్వామ్యబద్ధంగా.. సమాన అవకాశాలతో అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ (India AI Summit) లో భాగంగా రూపొందే డిల్లీ డిక్లరేషన్ ఒక మల్టిలాటరల్ ఒప్పందంగా.. అంటే అనేక దేశాలు కలిసి రూపొందించే ప్రకటనగా ఉండనుంది.

Read Also: Bangladesh: తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి స్పీకర్ ఓం బిర్లా!

India AI Summit: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఇండియా కీలక ప్రకటన

సమ్మిట్‌ను ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ

ఇందులో AI వనరుల ప్రాప్యతను కొద్దిమంది పెద్ద సంస్థలకే పరిమితం చేయకుండా, చిన్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, గ్లోబల్ సౌత్‌లోని దేశాలకు కూడా చేరేలా విధానాలను రూపొందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించనున్నారు. అంతేకాదు, వివిధ రంగాల్లో AI వినియోగానికి అవసరమైన సాఫ్ట్‌వేర్, ఫ్రేమ్‌వర్క్‌లు, ప్రమాణాలు (స్టాండర్డ్స్) ఒకే విధంగా ఉండేలా ప్రమాణీకరణపై కూడా ఈ ప్రకటన దృష్టి సారించనుందని తెలుస్తోంది. AI AI ఈ సమ్మిట్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా AI వినియోగాలు, విధానాలు, భవిష్యత్తు దిశలపై జరుగుతున్న అతిపెద్ద చర్చా వేదికలలో ఒకటిగా మారింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ప్రభుత్వ పరిపాలన వంటి కీలక రంగాల్లో AIని ఎలా ఉపయోగించవచ్చో ఈ సదస్సులో విస్తృతంగా చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఈ సమ్మిట్ బాధ్యతాయుతమైన, అభివృద్ధి దిశగా సాగిపోయే, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించే AI పరిశోధనకు బలమైన వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.

తుది దశకు చేరుకున్న డిల్లీ డిక్లరేషన్‌పై ముసాయిదా తయారీ!

AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026.. ప్రపంచ దేశాలకు దిక్చూచిలా మారనున్న భారత్.. హైలెట్స్ ఇవిగో.. ప్రస్తుతం డిల్లీ డిక్లరేషన్‌పై ముసాయిదా తయారీ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. వచ్చే గురువారం ప్రపంచంలోని పలు దేశాల కీలక నేతలు, ప్రతినిధులు దీనిపై చర్చలు జరపనున్నారు. ఈ సమావేశాల్లో ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, యూఏఈ (దుబాయ్) వంటి దేశాల అధికార ప్రతినిధులతో పాటు భారత్ కూడా చురుకైన పాత్ర పోషించనుంది. ఈ సమ్మిట్‌లో AIకు సంబంధించిన కాపీరైట్ సమస్యలు, చట్టపరమైన, సాంకేతిక అంశాలపై కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా AI మోడళ్లను ట్రెయిన్ చేయడానికి కాపీహక్కు ఉన్న కంటెంట్‌ను ఎలా ఉపయోగించాలి అనే అంశం క్లిష్టమైనప్పటికీ, అవసరమైనదేనని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై గతంలో చేసిన ప్రతిపాదనలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వచ్చాయి. అంతేకాదు, ఈ సమ్మిట్‌కు ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. OpenAI, Anthropic, Google, Microsoft వంటి సంస్థల నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భారతదేశం నుంచి Reliance Industries, Infosys, Wipro వంటి సంస్థలు AI రంగంలో తమ వ్యూహాలు, పెట్టుబడి ప్రణాళికలను వివరించే అవకాశముంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AI Governance AI Impact Summit AI innovation Artificial Intelligence India Digital India Emerging Technologies India AI policy India Tech Announcement India Technology News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.