భారతదేశం(India) తన సాయుధ దళాల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్‌ను అందించే దిశగా ఇజ్రాయెల్(Israel) సంస్థతో చర్చలు జరుపుతోంది. ఈ సిస్టమ్‌ను భారత సాయుధ దళాల్లో చేరేలా చేస్తే, దేశ రక్షణ వ్యవస్థ మరింత శక్తివంతం అవుతుంది.
భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ “అర్బెల్” కంప్యూటరైజ్డ్ ఆయుధ వ్యవస్థపై చర్చలు జరుపుతోంది. ఈ వ్యవస్థను తయారుచేసే ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ (IWI) సంస్థ, భారత్‌తో మొదటి దశ చర్చలను విజయవంతంగా పూర్తి చేసింది. సంస్థ సీఈఓ షుకి స్క్వార్ట్జ్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆయన ప్రకారం, భారత్‌కు ఆర్బెల్ సిస్టమ్ అందించేందుకు వారు ప్రస్తుతం తదుపరి చర్చలు జరుపుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: