ప్రపంచంలోని శక్తిమంతమైన పాస్‌పోర్టుల(Passports) జాబితాలో భారత్ స్థానంలో గతేడాదితో పోలిస్తే కొంత మెరుగుదల (Improvement)కనిపించింది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025 తాజా ర్యాంకింగ్స్ ప్రకారం, గత ఏడాది 80వ స్థానంలో ఉండగా.. ఈసారి మూడు స్థానాలు మెరుగుపడి 77వ స్థానానికి చేరింది. అయితే, వీసా రహితంగా ప్రయాణించగల దేశాల సంఖ్య మాత్రం 62 నుంచి 59కి తగ్గింది. మలేసియా, ఇండోనేసియా, మాల్దీవులు, థాయ్‌లాండ్ వంటి దేశాలు వీసా లేకుండా ప్రవేశాన్ని అనుమతిస్తుండగా, శ్రీలంక, మకావు, మయన్మార్ వంటి కొన్ని దేశాలు భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఈ జాబితా దేశ పౌరులు ఎన్ని దేశాలకు వీసా లేకుండా వీసా-ఆన్-అరైవల్ ద్వారా ప్రయాణించగలరో ఆధారంగా తయారు చేయబడుతుంది.
సింగపూర్ అగ్రస్థానం
హెన్లీ సూచిక ప్రకారం, ఈ సంవత్సరం ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ వంటి దేశాలు 1వ స్థానాన్ని భాగస్వామ్యం చేసుకున్నాయి. ఈ దేశాల పౌరులు 194 దేశాలకు వీసా అవసరం లేకుండా ప్రయాణించగలుగుతున్నారు. వీసా రహితంగా ట్రావెల్ చేయగలిగిన గమ్యస్థానాల ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025 ఈ ర్యాంకింగ్స్‌ను ఇచ్చింది. మొత్తం 199 దేశాల్లో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల (Passports) జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో సింగపూర్ పాస్‌పోర్టు (Passports) అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఈ సారి సింగపూర్ మాత్రమే టాప్ ర్యాంక్ సాధించింది. ఇక ఈ జాబితాలో జపాన్, దక్షిణ కొరియా దేశాలు రెండోస్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 190 దేశాలను చుట్టిరావొచ్చు. డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, స్పెయిన్‌లు మూడో స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 189 దేశాల్లో వీసా లేకుండానే ప్రయాణాలు సాగించొచ్చు. ఆస్ట్రియా, బెల్జియం, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, స్వీడన్ సంయుక్తంగా 4వ స్థానంలో నిలిచాయి. న్యూజిలాండ్, గ్రీస్, స్విట్జర్లాండ్ 5వ స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాలో అఫ్గానిస్థాన్ చిట్ట చివరి స్థానంలో నిలిచింది. ఆదేశ పాస్‌పోర్టుతో కేవలం 25 దేశాలకు మాత్రమే వీసా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది.
భారతీయ పాస్‌పోర్ట్ రకాలు
భారతదేశంలో, ప్రధానంగా నాలుగు రకాల పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి: సాధారణ (నీలం), అధికారిక (తెలుపు), దౌత్య (మెరూన్) మరియు అత్యవసర సర్టిఫికేట్ (నారింజ). ప్రతి రకం వేరే ప్రయోజనాన్ని అందిస్తుంది మరియు వ్యక్తి యొక్క స్థితి మరియు వారి ప్రయాణ స్వభావం ఆధారంగా జారీ చేయబడుతుంది.
పాస్‌పోర్ట్ సేవ అంటే ఏమిటి?
పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్ పౌరులకు పాస్‌పోర్ట్ మరియు సంబంధిత సేవలను సకాలంలో, పారదర్శకంగా, మరింత అందుబాటులో ఉండే విధంగా అందించడానికి రూపొందించబడింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Donald Trump: భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపా: ట్రంప్