📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Tuberculosis (TB) : ప్రపంచంలో అత్యధిక టీబీ కేసులు భారత్లోనే – పరిశోధకులు

Author Icon By Sudheer
Updated: April 11, 2025 • 6:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచవ్యాప్తంగా క్షయవ్యాధి (ట్యూబర్‌క్లోసిస్ – TB) వ్యాప్తి క్రమంగా తగ్గుతున్నప్పటికీ, భారత్‌లో మాత్రం దీనిపై ఆందోళనకర స్థితి నెలకొంది. తాజాగా హైదరాబాద్లో ప్రారంభమైన టీబీ అంశంపై సదస్సులో పలువురు ఆరోగ్య నిపుణులు, పరిశోధకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు భారతదేశంలో అత్యధిక టీబీ కేసులు నమోదు అవుతున్నాయని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో టీబీ భాదితుల సంఖ్య ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.

2023లో 3 లక్షల మంది మృతులు

ఈ సదస్సులో నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం, కేవలం 2023లోనే టీబీ కారణంగా భారత్‌లో 3 లక్షలమందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ముందస్తుగా గుర్తించి, సమయానికి చికిత్స అందిస్తే ఈ మరణాలను నివారించవచ్చని వారు తెలిపారు. టీబీ అనేది పూర్తిగా తగ్గించగలిగే వ్యాధి అయినప్పటికీ, సరైన అవగాహన లేకపోవడం, తగిన వైద్యం అందకపోవడం వల్ల దీని ప్రభావం ఇంకా కొనసాగుతుందన్నారు.

TB

టీబీపై సమిష్టిగా పోరాటం అవసరం

టీబీపై విజయం సాధించాలంటే ప్రభుత్వం, ఆరోగ్య సంస్థలు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు – అందరూ కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, పరీక్షలు, మందులు అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. భారతదేశం వంటి జనాభా ఎక్కువ దేశంలో టీబీ నియంత్రణ ఒక సవాలుగా మారిందని వారు అన్నారు. “టీబీ రహిత భారత్” లక్ష్యంగా ముందుకెళ్లే సమయం ఇదే” అని నిపుణులు స్పష్టం చేశారు.

Google News in Telugu tb case india tuberculosis (TB)

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.