📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Malaysia మలేషియా వెళ్లే భారతీయులకు కేంద్రం కొన్ని సూచనలు

Author Icon By Vanipushpa
Updated: August 29, 2025 • 2:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మలేషియా(Malaysia) ప్రభుత్వం భారతీయులకు 30 రోజుల వీసా ఫ్రీ ఎంట్రీ(Visa Free Entry) సౌకర్యాన్ని కల్పించింది. అయితే, ఈ సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మంది భారతీయ పౌరులు మలేషియా విమానాశ్రయాల్లో అడుగుపెట్టకుండానే వెనక్కి తిరిగి రావలసి వస్తోంది. అక్కడి ఇమ్మిగ్రేషన్(Immigration) అధికారులు వారిని ‘నాట్ టు ల్యాండ్’ (NTL) కేటగిరీ కింద చేర్చి, దేశంలోకి ప్రవేశాన్ని నిరాకరిస్తున్న ఘటనలు ఇటీవల పెరిగాయని భారత్‌లోని మలేషియా హైకమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఫ్రీ వీసాతో ఉద్యోగాల కోసం సెర్చింగ్
భారతీయ ప్రయాణికులను వెనక్కి పంపడానికి గల ప్రధాన కారణాలను కూడా హైకమిషన్ స్పష్టంగా వివరించింది. ప్రయాణానికి సరిపడా డబ్బు లేకపోవడం, బస చేసేందుకు సరైన ఆధారాలు (హోటల్ బుకింగ్ వంటివి) చూపించకపోవడం, తిరుగు ప్రయాణానికి కచ్చితమైన విమాన టికెట్ లేకపోవడం వంటి కారణాలతో ఎంట్రీని నిరాకరిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ఈ వీసా పథకాన్ని అడ్డం పెట్టుకుని ఉద్యోగాల కోసం వస్తున్నారని అనుమానం వచ్చినా కూడా వారిని అనుమతించడం లేదని తెలిపింది.

మలేషియా వెళ్లే భారతీయులకు కేంద్రం కొన్ని సూచనలు

ఇలా ‘నాట్ టు ల్యాండ్’ కింద తిరస్కరణకు గురైన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఏ విమానయాన సంస్థ మలేషియాకు తీసుకొచ్చిందో, అదే సంస్థ వారిని తిరిగి భారత్‌కు పంపేంత వరకు విమానాశ్రయంలోనే వేచి ఉండాల్సి వస్తుంది. దీనికి కొన్నిసార్లు ఎక్కువ సమయం పట్టడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోతున్నారు.
కేవలం పర్యటనల కోసమే వీసా ఫ్రీ
మరోవైపు, ఈ వీసా ఫ్రీ పథకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మోసపూరిత ఏజెంట్లు అమాయక భారతీయులను తప్పుదోవ పట్టిస్తున్నారని హైకమిషన్ హెచ్చరించింది. ఈ స్కీమ్ కింద మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేస్తున్నారని, అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ వీసా ఫ్రీ పథకం కేవలం పర్యటనల కోసమేనని, ఉద్యోగాల కోసం కాదని స్పష్టం చేసింది. కాబట్టి మలేషియాకు వెళ్లే భారతీయ పౌరులు ప్రయాణానికి అవసరమైన అన్ని పత్రాలు, నిధులు, రిటర్న్ టికెట్ వంటివి కచ్చితంగా దగ్గర ఉంచుకోవాలని, ఇమ్మిగ్రేషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హైకమిషన్ స్పష్టం చేసింది.

మలేషియా అనే పేరు చరిత్ర ఏమిటి?
1957లో యునైటెడ్ కింగ్‌డమ్ నుండి స్వాతంత్ర్యం పొందిన రాష్ట్రం, మొదటి సహస్రాబ్ది CEలో మలయ్ ద్వీపకల్పంలోని ఎగువ భాగంలో ఉన్న చారిత్రాత్మక రాజ్యం పేరు మీద మలేషియా మరియు లంకాసుకా వంటి ఇతర సంభావ్య పేర్లకు ప్రాధాన్యతనిస్తూ ఫెడరేషన్ ఆఫ్ మలయా అనే పేరును తీసుకుంది.

మలేషియాను కౌలాలంపూర్ అని ఎందుకు పిలుస్తారు?

మలేషియాలో కౌలాలంపూర్ అంటే "బురద సంగమం" అని అర్ధం
మలేషియా అధికారిక భాష అయిన మలయ్‌లో కౌలాలంపూర్ అంటే "బురద సంగమం" అని అర్ధం. ఈ పేరు రెండు నదులు - క్లాంగ్ నది మరియు గోంబాక్ నది - కలిసే ప్రదేశంలో కౌలాలంపూర్ స్థానం నుండి వచ్చింది.

Read hindi news:hindi.vaartha.com/

Read Also:

https://vaartha.com/latest-news-speculations-over-jd-vance-trumps-health-jd-says-he-is-ready-for-the-responsibilities-of-the-presidency/international/537632/

india indian government Latest News Breaking News malaysia Safety Guidelines Telugu News Travel Advisory

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.