📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

India: అవకాశం ఇవ్వండి..అన్వేష్ ను తీసుకొస్తా.. ఉక్రెయిన్ మహిళ

Author Icon By Saritha
Updated: January 8, 2026 • 1:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతి వ్యక్తికి భారత రాజ్యాంగం ఇష్టమైన మతాన్ని అనుసరించే స్వేచ్ఛతో పాటు మాట్లాడే స్వేచ్చ కూడా ఇచ్చింది. ఇతరుల మనోభావాలను దెబ్బతీయనంతవరకు సమాజంలో శాంతికి విఘాతం కలగనంతవరకు మనం ఏదైనా మాట్లాడవచ్చు. ఏ మతాన్ని అయినా ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా మాట్లాడితే అలాంటివారు చట్టపరమైన శిక్షకు గురికావాల్సిందే. ప్రస్తుతం తెలుగు యూట్యూబర్ అన్వేష్ ను శిక్షించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. తెలుగు యూట్యూబర్ అన్వేష్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచ పర్యాటకుడిగా ప్రసిద్ధి చెందిన ఈ వ్యక్తి అనేక దేశాల్లో పర్యటిస్తూ యూట్యూబ్ లో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ను సంపాదించాడు. కానీ.. రెచ్చగొట్టే, వికృత చేష్టలు, జుగుప్సాకర వ్యాఖ్యలతో తీవ్ర వ్యతిరేకతను కూడగట్టుకున్నాడు. హిందూ దేవతలు, మహిళల పట్ల అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేసిన (India) యూట్యూబర్ అన్వేష్ పై తాజాగా విదేశీ మహిళ విరుచుకుపడింది. నాకు అనుమతి ఇవ్వండి.. అన్వేష్ ను భరతమాత కాళ్ల దగ్గరకు తీసుకోస్తా అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. 

Read also: Prakasam crime: వివాహేతర సంబంధం.. కాటికి ఇద్దరి ప్రాణాలు

Give me a chance I will bring Anvesh back, says Ukrainian woman.

అన్వేష్ తీరుపై అటు నెటిజన్ల మండిపాటు

ఉక్రెయిన్ కి (Ukraine) చెందిన లిడియా లక్ష్మి ఆంధ్రా అబ్బాయి తుమ్మపాల వెంకట్ ను వివాహం చేసుకున్నారు. (India) భారతదేశంలోని సనాతన ధర్మానికి ఆమె ఫిదా అయ్యారు. ఇక్కడి సంస్కృతి, సనాతన ధర్మాన్ని స్టడీ చేసిన లక్ష్మీ ధర్మంపట్ల తన నిబద్ధతను చాటుకుంటున్నారు. థాయిలాండ్ ఎంబసీలో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న ఆమె తనకు అవకాశం ఇస్తే అన్వేష్ ను పట్టుకొస్తానని చెబుతున్నారు. లేకపోతే మరో దేశానికి అతడు పారిపోయే అవకాశాలున్నాయని ఆమె స్పష్టం చేశారు. అన్వేష్ తీరుపై అటు నెటిజన్లు, ఇటు సినీప్రముఖులు సైతం మండిపడుతున్నారు. హిందూ దేవతలు, మహిళల పట్ల అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ కేసులో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

AnveshControversy HinduDeitiesRespect Latest News in Telugu LegalActionIndia OnlineAbuse Telugu News YouTuberNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.