భారత్- ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం చరిత్రాత్మక ముందడుగు అని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం కుదిరేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో చొరవ చూపారని అన్నారు. ఐరోపా, భారత సహకారం కొత్త శిఖరాలకు చేరుతోందని పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఈ ఒప్పందం భారత్- ఐరోపా దేశాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని చెప్పారు. ఐరోపా, భారత బంధం ఈనాటిది కాదని, తమ పూర్వీకులు కూడా గోవాకు చెందిన వారు ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా తన విదేశీ భారతీయ కార్డును చూపించారు.
Read Also: Parliament Updates: ప్రారంభమైన అఖిలపక్ష భేటీ
నా మూలాలు గోవాలో వున్నాయి: ఆంటోనియో కోస్టా
నేను యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడిని కావచ్చు. కానీ నేను విదేశీ భారతీయుడిని కూడా. నా మూలాలు గోవాలో ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. నా తండ్రి కుటుంబం ఇక్కడి నుంచే వచ్చింది. అందుకే భారత్- ఐరోపా (EU)మధ్య ఉన్న సంబంధం నాకు మరింత ప్రత్యేకం. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్‌ది. మన రెండు ఖండాల మధ్య ఎన్నో శతాబ్దాలుగా వ్యాపారం సాగుతోంది. భౌగోళిక రాజకీయ స్థిరత్వానికి, ఆర్థిక వృద్ధికి చాలా ముఖ్యమైనది. ఈ వాణిజ్య ఒప్పందాలు దేశాల మధ్య ఆర్థిక నియమాలతో పాటు భాగస్వామ్య శ్రేయస్సును ప్రోత్సహిస్తాయి ఆంటోనియో కోస్టా అని అన్నారు.
భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి
దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ చర్చల తర్వాత ఈ భారీ ఒప్పందం ఒక కొలిక్కి వచ్చింది. 1962లో ఐరోపా ఆర్థిక సముదాయంతో భారత్ సంబంధాలు ప్రారంభించగా, 2004లో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. 2007లో మొదలైన FTA చర్చలు అనేక అడ్డంకులను దాటుకుని నేడు ఒక వాస్తవ రూపం దాల్చాయి. ఐరోపా సమాఖ్య ఇప్పటికే భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2024-25లో ఇరుపక్షాల మధ్య సుమారు 13 వేల 600 కోట్ల డాలర్ల వాణిజ్యం జరిగింది. ఈ ఒప్పందంతో భారత్‌కు 45 కోట్ల జనాభా ఉన్న ఐరోపా మార్కెట్ అందుబాటులోకి రానుంది. వస్త్రాలు, తోలు వస్తువులు, ఐటీ సర్వీసులు, ఫార్మా రంగానికి ఈ ఒప్పందం ద్వారా భారీ ఊరట కలగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: