India EU FTA : భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య సాగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు కీలక మలుపు తిరిగాయి. 2007లో ప్రారంభమైన ఈ చర్చలు దాదాపు 19 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తుది దశకు చేరుకోవడం గ్లోబల్ వాణిజ్య రంగంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఒప్పందం అమలైతే రక్షణ రంగం నుంచి ఉపాధి అవకాశాల వరకు భారత్‌కు విస్తృత ప్రయోజనాలు దక్కనున్నాయి.
ఈ ఎఫ్‌టీఏ కేవలం దిగుమతులు–ఎగుమతులకే పరిమితం కాకుండా, రక్షణ రంగంలో సాంకేతిక సహకారాన్ని ప్రధానంగా ప్రోత్సహించనుంది. యూరోపియన్ దేశాల నుంచి ఆధునిక రక్షణ సాంకేతికత భారత్‌కు బదిలీ కావడంతో, ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాలకు మరింత బలం చేకూరనుంది. దీంతో దేశీయ రక్షణ ఉత్పత్తులు, పరిశోధనకు కొత్త దిశలు తెరుచుకుంటాయి.
Read Also:Telangana: ఫ్లాగ్ హోస్టింగ్ సమయంలో అపశృతి
ఈ ఒప్పందంలో అత్యంత కీలక అంశంగా వర్కర్ మొబిలిటీ నిలవనుంది. ఐటీ, ఇంజనీరింగ్, వైద్య రంగాలకు చెందిన భారతీయ నిపుణులకు యూరప్‌లో ఉద్యోగ అవకాశాలు విస్తరించే అవకాశం ఉంది. వీసా నిబంధనల సడలింపు, పని అనుమతుల్లో వెసులుబాటు వల్ల భారత యువతకు యూరప్ మార్కెట్ మరింత చేరువ కానుంది.
సుంకాలు, డేటా ప్రైవసీ, మేధో సంపత్తి హక్కులపై విభేదాల కారణంగా 2013లో చర్చలు నిలిచిపోయాయి. అయితే 2021 తర్వాత పరిస్థితులు మారడంతో ఇరు పక్షాలు మళ్లీ చర్చలకు వేగం పెంచాయి. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలన్న యూరప్ ఆలోచన భారత్‌కు అనుకూలంగా మారింది. ఈ ఒప్పందం అమలైతే భారత్–ఈయూ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం వందల బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: