బంగ్లాదేశ్ లో గత కొన్నిమాసాలుగా నిరసనలు, హింసలతో అతలాకుతలమైపోయింది. భారీగా ప్రభుత్వ ఆస్తులకు భంగం వాటిల్లడమేకాకుండా ప్రశాంత ప్రజాజీవనం లేకుండా పోయింది. నిత్యం రోడ్లుపై నిరసనకారులు ధర్నాలు, నిరసనలు కాస్త హింసాత్మకంగా మారుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ (Bangladesh) రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన ‘ఇంకిలాబ్ మంచో’ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యకు పాల్పడిన ఇద్దరు ప్రధాన నిందితులు భారత్ లోకి పారిపోయినట్లు ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు (డిఎంపి) అధికారికంగా ధృవీకరించారు. మేఘాలయ సరిహద్దుల గుండా
వారు అక్రమంగా సరిహద్దు దాటినట్లు దర్యాప్తులో తేలింది.
Read Also: Japan: చైనా-తైవాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. సైన్యం మోహరింపు
భారత్ ధృవీకరించాలి
ఢాకాలో జరిగిన మీడియా సమావేశంలో అదనపు కమిషనర్ ఎన్. నజ్రుల్ ఇస్లాం మాట్లాడుతూ నిందితులు పైసల్ కరీమ్ మసూద్, ఆలంగీర్ షేక్ మైమెన్సింగ్ లోని వాలువా ఘాట్ సరిహద్దు ద్వారా భారత్ లోకి ప్రవేశించారని తెలిపారు. వీరిద్దరూ సరిహద్దు దాటాక ‘పుర్తి’ అనే వ్యక్తి వారిని రిసీవ్ చేసుకున్నాడని.. ఆ తర్వాత ‘సమీ’ అనే టాక్సీ డ్రైవర్ వారిని మేఘాలయలోని తురా పట్టణానికి తరలించినట్లు సమాచారం అందిందని వివరించారు. ఈ క్రమంలో వీరికి సహకరించిన పుర్తి, సమీలను ఇప్పటికే భారత అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు అనధికారిక నివేదికలు అందాయని.. దీనిపై భారత్ నుంచి అధికారిక ధవీకరణ రావాల్సి ఉందన్నారు.
ఉస్మాన్ హదీ ఎవరు?
షరీఫ్ ఉస్మాన్ హదీ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. గత ఏడాది షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి దారితీసిన విద్యార్థి ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. భారత్, అవామీ లీగ్ ను తీవ్రంగా విమర్శించే హాదీ.. ‘ఇంకిలాబ్ మంచో’ పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేసి, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే డిసెంబర్ 12వ తేదీన ఢాకాలో ముసుగు ధరించిన దుండగులు ఆయన తలపై కాల్పులు జరిపారు. సింగపూర్ లో చికిత్స పొందుతూ డిసెంబరు 18న మరణించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: