ఐక్యరాజ్యసమితి మావన హక్కుల మండలి (UNHRC))కి ఏడో సారి భారత్ ఎన్నికైంది. 2026 నుంచి 2028 వరకు యూఎన్‌హెచ్ఆర్‌సీ సభ్యదేశంగా భారత్ కొనసాగనున్నది. జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మావన హక్కుల మండలి(UNHRC)కి ఏడో సారి భారత్ ఎన్నికైంది. మంగళవారం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. భారత్‌కు చెందిన మూడేళ్ల కాలపరిమితి 2026 జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభంకానున్నట్లు యూఎన్‌హెచ్ఆర్‌సీ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నది. యూఎన్‌హెచ్ఆర్‌సీ అంటే ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణ, హక్కుల మావబావాలను పర్యవేక్షించు, నివారించే సంస్థ. ఈ మండలి 47 సభ్య దేశాలుగా ఉండి, సభ్యులను UN జనరల్ అసెంబ్లీ ద్వారా ఎన్నిక చేస్తుంది. ప్రతి సభ్యుని పదవీకాలం మూడు సంవత్సరములు ఉంటుంది. సభ్య దేశాలు ప్రాంతీయ సమీకరణ ఆధారంగా న్యాయసంబంధ సీట్లు కేటాయించబడతాయి.
యూఎన్ భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ కూడా స్పందించారు. భారత్‌కు మద్దతు ఇచ్చిన వారికి ఆయన తన సోషల్ మీడియా పోస్టులో కృతజ్ఞతలు తెలిపారు. ఏడోసారి మానవ హక్కుల మండలికి (UNHRC) ఎన్నికైనట్లు ఆయన పేర్కొన్నారు. తమ పదవీకాలంలో మానవ హక్కుల రక్షణ కోసం పాటుపడనున్నట్లు భారత్ చెప్పింది. యూఎన్ మానవ హక్కుల మండలిలో మొత్తం 47 సభ్యదేశాలు ఉన్నాయి.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ఎప్పుడు ఏర్పడింది ?
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ (UNCHR, ఇక్కడ CHR) స్థానంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 15 మార్చి 2006న ఈ మండలిని స్థాపించింది. ఈ మండలిని మానవ హక్కుల హై కమిషనర్ కార్యాలయం (OHCHR)తో కలిసి పని చేస్తుంది మరియు ఐక్యరాజ్యసమితి ప్రత్యేక విధానాలను నిర్వహిస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడే సభ్య దేశాలను చేర్చినందుకు కౌన్సిల్‌ను తీవ్రంగా విమర్శించారు.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశాలెన్ని?
UNHRC సంవత్సరానికి మూడుసార్లు, మార్చి, జూన్ మరియు సెప్టెంబర్‌లలో సాధారణ సమావేశాలను నిర్వహిస్తుంది.[14] సభ్య దేశాలలో మూడింట ఒక వంతు మంది అభ్యర్థన మేరకు, మానవ హక్కుల ఉల్లంఘనలు మరియు అత్యవసర పరిస్థితులను పరిష్కరించడానికి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని UNHRC ఎప్పుడైనా నిర్ణయించవచ్చు. నవంబర్ 2023 నాటికి, 36 ప్రత్యేక సమావేశాలు జరిగాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: