ఇరాన్ లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో భారతదేశం(India) దేశ పౌరులకు కీలక సూచనలు చేసింది. టెహ్రాన్ కు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలను మానుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. తదుపరి ఆదేశాల వరకు ఇరాన్ కు అనవసర ప్రయాణాలను నివారించుకోవాలని సూచించింది. అంతేకాక ప్రస్తుతం ఇరాన్ లో ఉన్న భారతీయ పౌరులు, భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండి, నిరసనలు లేదా ప్రదర్శనలు జరిగే ప్రదేశాలకు దూరంగా ఉండాలని, టెహ్రాన్ లోని భారత ఎంబసీకి చెందిన వెబ్ సైట్, సోషల్ మీడియా హ్యాండిళ్లను నిశితంగా గమనిస్తూ ఉండాలని కేంద్రం పిలుపునిచ్చింది. రెసిడెంట్ వీసాలపై ఇరాన్ లో నివసిస్తున్న భారతీయులు భారత ఎంబసీలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరింది.
Read also: USA: హైదరాబాద్ యువతి హత్య కేసు.. మాజీ రూమ్మేటే హంతకుడా?

కొనసాగుతున్న నిరసనలు
స్థానిక మీడియా ప్రకారం ఇరాన్ లోని కొన్ని ప్రాంతాల్లో(India) ఆందోళనలు తీవ్రరూపం దాల్చినట్లు సమాచారం. ఇప్పటికే భద్రతా దళాల కాల్పుల్లో 35మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయాల పాలయ్యారు. పరిస్థితులు చేదాటిపోతున్నాయన్న భావన అక్కడి ప్రజలను భయకంపితులను చేస్తున్నది.
మరోవైపు నిరసనకారులపై జులం ప్రదర్శిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే ఇరాన్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నిరసనకారులు చనిపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన విషయం విధితమే. నిరసనలు హింసాత్మకంగా మారితే అమెరికా రంగంలోకి దిగాల్సి ఉంటుందని ట్రంప్ ఇదివరకే హెచ్చరించారు. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని, భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత్ ఇరాన్ లోని భారత పౌరులను హెచ్చరించింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: