📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

చినో హిల్స్‌లోని హిందూ దేవాలయం పై దాడి

Author Icon By Anusha
Updated: March 9, 2025 • 3:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో కాలిఫోర్నియాలోని చినో హిల్స్‌లో ని హిందూ దేవాలయం పై కొంతమంది గుర్తుతెలియని దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఇటీవల కాలంలో అమెరికాలో ఈ తరహా ఘటనల్లో ఇది మూడోది.భారత ప్రభుత్వం ఈ దాడి పై తీవ్రంగా ఖండించింది. ఈ విధ్వంసక చర్యలకు పాల్పడిన దోషులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అలాగే, ప్రార్థనా స్థలాలకు తగిన భద్రత కల్పించాలని స్థానిక అధికారులను కోరింది.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, “కాలిఫోర్నియాలోని చినో హిల్స్ హిందూ ఆలయంలో విధ్వంసానికి సంబంధించిన నివేదికలను మేము పరిశీలించాము. ఇలాంటి నీచమైన చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము” అని అన్నారు.

బాప్స్ సంస్థ స్పందన

ఈ దాడిపై బోచసన్వాసి అక్షర్ పురుషోత్తమ స్వామినారాయణ సంస్థ ( బాప్స్) కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆలయ గోడలపై హిందూ వ్యతిరేక నినాదాలు రాయడం, ఆలయాన్ని అపవిత్రం చేయడం తీవ్ర నిరసనలకు దారితీసింది.బాప్స్ పబ్లిక్ అఫైర్స్ విభాగం ఓ అధికారిక ప్రకటనలో, “ఈ విధ్వంసక చర్యల నేపథ్యంలో హిందూ సమాజం ద్వేషానికి వ్యతిరేకంగా దృఢంగా నిలుస్తుంది. చినో హిల్స్, దక్షిణ కాలిఫోర్నియాలోని సమాజంతో కలిసి మేము ద్వేషాన్ని వ్యతిరేకిస్తాము” అని పేర్కొంది.

భద్రతా చర్యలు

భారత ప్రభుత్వం అమెరికా ప్రభుత్వాన్ని ఈ ఘటనపై గట్టిగా స్పందించాలని కోరింది.దోషులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేసింది.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతను పెంచాలని కోరింది.అమెరికాలోని హిందూ సమాజానికి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గతేడాది సెప్టెంబర్ నెలలో క్యాలిఫోర్నియాలోని సాక్రామెంటోలో బాప్స్ (బొచ్చసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ సంస్థ) దేవాలయంపై దాడి జరిగింది. అంతకంటే కొద్దిరోజుల ముందే న్యూయార్క్ లోని మెల్విలెలోని మరో బాప్స్ దేవాలయంపై కూడా దాడి జరిగింది.చినో హిల్స్‌లోని శ్రీ స్వామినారాయణ మందిరం పై దాడి జరిగినట్లు సమాచారం. ఆలయ గోడలపై అనుచితమైన నినాదాలు రాయడం, మతపరమైన ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరగడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది.

#BAPS #ChinoHillsTemple #HinduTempleAttack #IndiaProtests #ReligiousFreedom Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.