📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

United Nations : సింధు జలాల ఒప్పందంపై భారత్ స్పష్టీకరణ

Author Icon By Shobha Rani
Updated: May 24, 2025 • 12:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సింధు (Sindhu) జలాల ఒప్పందంపై పాకిస్థాన్ దుర్నీతిని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ తూర్పారపట్టింది. సింధు (Sindhu) జలాల ఒప్పందంపై చేసిన తప్పుడు ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. భారత్‌పై వేలాది ఉగ్రదాడులు చేయడమే కాకుండా 20,000 మందిని పొట్టనపెట్టుకుందని, తద్వారా మూడు యుద్ధాలకు పాకిస్థాన్‌ కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితంగా సింధు(Sindhu) జలాల ఒప్పందం స్ఫూర్తిని తుంగలో తొక్కిందని దుయ్యబట్టింది. పాక్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్‌లోని పౌరుల జీవితాలను, మత సామరస్యాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తోందని పేర్కొంది.సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంపొందించుతూ భారతదేశంలోని మత సామరస్యాన్ని, ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయాలనే కుట్ర పాక్ చేస్తోందని ఆరోపించారు.
20 వేల మంది భారతీయుల బలి
ఐరాసలో పౌరుల రక్షణ అంశంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్‌ రాయబారి ఇఫ్తికర్‌ అహ్మద్‌ సిందు జాలల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని ప్రస్తావించారు. దీనిపై భారత్‌ దీటుగా బదులిచ్చింది. సింధు (Sindhu) జలాల అంశంలో భారత్‌ ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తెలిపారు. 65 ఏళ్ల క్రితం భారత్‌ చిత్తశుద్ధితో పాక్‌తో సింధు జలాల ఒప్పందం కుదుర్చుకుందని, ఆరున్నర దశాబ్దాల్లో పాకిస్థాన్‌ మూడు యుద్ధాలు చేసి ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని చెప్పారు. గత నాలుగు దశాబ్దాల్లో ఉగ్రవాదులు చేసిన దాడుల వల్ల భారత్‌లో 20 వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని వివరించారు.

United Nations : సింధు జలాల ఒప్పందంపై భారత్ స్పష్టీకరణ


భారత ప్రస్తావనలకు స్పందించని పాక్
అలాగే, ఒప్పందం జరిగి 65 ఏళ్లు అవుతోందని, కాల క్రమేనా కొన్ని పాత ఆనకట్టలతో భద్రతా సమస్యలు తలెత్తాయని, వాటి మరమ్మతులకు పాకిస్థాన్ అడ్డుకుంటుందని ఐరాస దృష్టికి తీసుకొచ్చారు. 2012లో తుల్​బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా, గత రెండేళ్లుగా ఒప్పందంలో సవరణలపై చర్చించాలని పాకిస్థాన్​ను భారత్ కోరుతోందని ఆయన ఐరాసకు తెలిపారు. కానీ పాకిస్థాన్ మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. వేదికల్లో ఎత్తి చూపిస్తూ తన వైఖరిని నిలబెట్టుకుంటోంది. సింధు జలాల ఒప్పందం వంటి కీలక విషయంలో కూడా, భారత్ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ నేపథ్యంలోనే సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ఆపే వరకు సిందు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తుందని హరీష్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నది భారత్ కాదని, పాకిస్తాన్ అని ఆయన చురకలు అంటించారు.
Read Also: Jharkhand: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌: JJMP అధినేతతో సహా నక్సల్స్ హతం

Google news India Clarification on Indus Water Telugu News Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.