గల్వాన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా (China–India relations) మధ్య నెలకొన్న ఉద్రిక్తత క్రమంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చైనా నిపుణులకు వాణిజ్య వీసాల జారీపై భారత ప్రభుత్వం తాజాగా సడలింపులు చేసింది. వీసా పరిశీలనలో జరుగుతున్న ఆలస్యాలు తగ్గి, వ్యాపారాలకు అవసరమైన నైపుణ్యం కలిగిన సిబ్బంది రాక ఇప్పుడు మరింత సులభమవుతోంది. ఇది రెండు దేశాల ఆర్థిక బంధానికి పాజిటివ్ అడుగుగా భావిస్తున్నారు.
Read also: Mexico tariffs :మెక్సికో టారిఫ్‌లు భారత దిగుమతులపై పెద్ద ప్రభావం?
India opens its gates for Chinese citizens.
ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం
SCO సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భేటీతో పరిస్థితులు కొంత హుందాగా మారాయి. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడం, సహకారాన్ని పెంచుకోవడం, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం వంటి అంశాలపై ఇరువురూ దృష్టి పెట్టారు. ఈ చర్చల తరువాతే వీసా నియమాల్లో సడలింపులు రావడం ప్రాధాన్యంగా మారింది. ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరాలని ఇరు దేశాలూ భావిస్తున్నాయి.
గత కొన్నేళ్లుగా కఠినమైన వీసా పరిశీలన కారణంగా భారత ఎలక్ట్రానిక్స్ రంగం భారీ నష్టాన్ని చవిచూసింది. ORF అంచనాల ప్రకారం ఇది 15 బిలియన్ డాలర్ల పరిధి వరకు వెళ్లింది. ఇప్పుడు వీసా ఆమోద సమయాన్ని నాలుగు వారాలకు తగ్గించడం పరిశ్రమలకు ఉపశమనం కలిగించనుంది. తాజా నిర్ణయం భారత్–చైనా వాణిజ్య సంబంధాలను మళ్లీ చురుకుగా చేయనున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: